చిత్త శుద్ధితో సచివాలయ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలి.. జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 చిత్త శుద్ధితో సచివాలయ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలి.. 


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్




ధర్మవరం, నవంబర్ 1 (ప్రజా అమరావతి):


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులందరూ కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు.  మంగళవారం  ధర్మవరం పట్టణంలో  జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గొట్లూరు సచివాలయం 1, మండల పరిధిలోని పోతుల నాగేపల్లి లో గల సచివాలయం, పట్టణంలోని సంజయ్ నగర్ లో గల 8వ వార్డు సచివాలయం,  ఆకస్మికంగా తనిఖీ చేశారు

 ఆయా సచివాలయ ల సిబ్బందితో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూసచివాలయ వ్యవస్థ ఎంతో కీలకమైనదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సచివాలయ ఉద్యోగులే ముఖ్యమైన పాత్రను వహించాలని తెలిపారు. తదుపరి సచివాలయ కార్యాలయంలో గల అన్ని రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలన్నీ కూడా వెనువెంటనే అప్లోడ్ చేయాలని వారు సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, కఠిన చర్యలు కూడా తప్పవని సూచించారు. ప్రజలలో మమేకమై సమస్యలను విని పరిష్కరించినప్పుడే సచివాలయ వ్యవస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని  తెలిపారు

 ఉద్యోగులు సమయపాలన యూనిఫార్మ్ తప్పనిసరిగా పాటించాలని, విధులలో నిర్లక్ష్యం, ఉండరాదని తెలుపుతూ తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించారు. తదుపరి 17వ వార్డులోని ప్రభుత్వ చౌక ధాన్యపు డిపోలో గల స్టాక్ ఉన్న బియ్యాన్ని తదితర సరుకులను కలెక్టర్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అందరికీ సకాలంలో నాణ్యమైన సరుకులు అందేలా  చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు


 ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నీలకంఠారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఇన్చార్జ్ ఎంపీడీవో మమతా దేవి,వీఆర్వో లు నజీర్ ఖాన్, వెంకటా చలపతి, శివరాం, స్టోర్ డీలర్ రాష్ట్ర నాయకుడు పరంధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


 

Comments