ఆక్వా కల్చర్ ద్వారా చేసే ఉత్పత్తి ప్రపంచ దేశాలతో ముడిపడిన ఉత్పత్తి...

 ఆక్వా కల్చర్ ద్వారా చేసే ఉత్పత్తి ప్రపంచ దేశాలతో ముడిపడిన ఉత్పత్తి...



భారత దేశంలో నంబర్ గా ఉన్న ఫారిన్ ఎక్సేంజ్ ఆక్వా రంగం ద్వారానే వస్తుంది...


ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ గా విభజించడానికి ఏదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా...?


ముందు కరెంట్ కోతలు లేకుండా ఆక్వా రైతులకు కరెంట్ ఇవ్వండి...

తిరుపతి (ప్రజా అమరావతి);

తిరుపతి పార్లమెంట్, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు గ్రామంలోని కన్నెగంటి ఆక్వా ఫీడ్స్ లో గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి  పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, వారి అధ్యక్షతన ఇదేం ఖర్మ ఆక్వా రైతులకు కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి  మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ గారు,తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి కురుగోండ్ల రామకృష్ణ, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి లు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు..

ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించి, మా తెలుగుతల్లి గీతాలాపనతో, ఆక్వా రైతుల ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య నేతల ప్రసంగాల అనంతరం చిల్లకూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని ముగించారు..


ఈ సందర్భంగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ...


జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి భూమిని నమ్ముకున్న రైతు కన్నీరు పెడుతూనే ఉన్నారని అన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీ బాధను పంచుకోగలం కానీ, తెచ్చి ఇచ్చే శక్తి లేదని అన్నారు.

ఏదైనా పరిశ్రమను బాగుచేయాలంటే, ఆ పరిశ్రమ మూలాలను తెలుసుకోవాలని, ఆంధ్ర రాష్ట్రం 65 శాతం వ్యవసాయ రంగం పై ఆధారపడిన రాష్ట్రం అని అందులో ఆక్వా కల్చర్ కూడా ఉందని అన్నారు.

ఇది ఏదో ఒకసారి పెట్టుబడి పెట్టేస్తే ఆదాయం వచ్చేది కాదని, ప్రతి సారి 80 నుంచి 85 శాతం వరకు పెట్టుబడి పెడితే, అన్ని బాగుంటే 10 నుంచి 15 శాతం ఆదాయం వచ్చే వ్యాపారం అన్నారు.

రైతులు మట్టిని బాగుచేసి, నాణ్యమైన సీడ్స్, ఫీడ్స్ వేసి, వాతావరణ సమస్యలను అధిగమించి పంటలు పండిస్తున్నారు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రేట్ ల విషయంలో అబద్ధాలు చెపుతుందని, వరి రైతులకు 16500 ఇస్తానని చెప్పి మాట తప్పిన విధంగానే ఇందులో కూడా మాట తప్పుతారని అన్నారు..

ఆక్వా కల్చర్ ద్వారా చేసే ఉత్పత్తి ప్రపంచ దేశాలతో ముడిపడిన ఉత్పత్తి అని అన్నారు.ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ గా విభజించడానికి ఏదేమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారమా అని ఎద్దేవా చేశారు. ముందు ఆక్వా రైతులకు కరెంట్ కోతలు ఎత్తేయలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు, తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు, తిరుపతి పార్లమెంట్, గూడూరు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments