రైతులకు మేలుచేసే నూతన వంగడాలను అవిష్కరించిన వ్యవసాయ మంత్రి

 *రైతులకు మేలుచేసే నూతన వంగడాలను అవిష్కరించిన వ్యవసాయ మంత్రి


*

*•7 జాతీయ స్థాయిలో,10 రాష్ట్ర స్థాయిలో మొత్తం 17 నూతన వంగడాలు ఆవిష్కర్ణ*

                                                                

అమరావతి, 3 నవంబరు (ప్రజా అమరావతి):  తక్కువ పెట్టుబడి, ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యత మరియు చీడపీడలను తట్టుకునే 17 రకాల నూతన వంగడాలను రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో ఆవిష్కరించారు. రైతులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే ఈ నూతన వంగడాలను రూపొందించిన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్  ఎ.విష్ణువర్థనరెడ్డిని, శాస్త్రవేత్తలను మరియు ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డిని, మేనేజింగ్  డైరెక్టర్ డా.శేఖర్ బాబును  మంత్రి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎటు వంటి బౌగోళిక, వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని వాణిజ్య సరళిలో సాగుకు అవకాశం ఉన్న వరి, రాగి మరియు  ప్రత్తి  పంటల్లో 7 జాతీయ స్థాయి నూతన వంగడాలకు ఇప్పటికే  కేంద్రం అనుమతి రావడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో అభివృద్ది పర్చిన నూతన వంగడాలను జాతీయ స్థాయిలో అనుమతి రావడం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికే కాకుండా మన రాష్ట్రానికే  ఎంతో గర్వకారణమన్నారు.  అదే విధంగా  వరి, రాగి, కొర్ర, మినుము, పెసర, శనగ, మరియు వేరుశనగ  పంటల్లో 10 రాష్ట్ర స్థాయి నూతన వంగడాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు.  రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన ఈ 10 నూతన వంగడాలను కూడా దేశ స్థాయిలో ఉపయోగించుకొనే అవకాశాన్ని పరిశీలించిన తదుపరి జాతీయ స్థాయి ఉపయోగానికి అనుమతి లబించినట్లైతే మరో 10 నూతన వంగడాలను దేశానికి అందించిన ఘనత రాష్ట్రానికి దక్కడం ఒక రికార్డే అని ఆయన అభివర్ణించారు.  రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించిన వరి యం.టి.యు.-1318  నూత వంగడానికి ఎంతో ప్రాచుర్యం ఉందని, రైతులు ఈ నూతన వంగడాన్ని ఎంతగానో ఆసిస్తున్నారని ఏ.పి. సీడ్స్ అధికారులు చెపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో నేడు విడుదల చేసిన ఈ నూతన వంగడాలను అన్నింటినీ ఒక సారి పరీక్షించి, సర్టిపై చేసి  అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది మంత్రి తెలిపారు.  

                                                                                                                                                                               రాష్ట్రంలో అమలు పరుస్తున్న పలు వ్యవసాయ సంస్కర్ణలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు  రాష్ట్రానికి వస్తున్నాయని, ఆ నేపధ్యంలోనే ఏ.పి.సీడ్స్ డవలెప్మెంట్  కార్పొరేషన్ కు ఒక జాతీయ స్థాయి అవార్డు నేడు రావడం జరిగిందంటూ  ఆ  కార్పొరేషన్ మేనేజింగ్  డైరెక్టర్ శేఖర్ బాబుకు మంత్రి అభినందలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం, అభివృద్ది విషయంలో కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్దకు అనుగుణంగా అనేక వ్యసాయ అనుబంద సంస్థలు ఆ దిశగా కృషిచేస్తున్నాయని, అందుకు ఈ నూతన వంగడాల ఆవిష్కరణే నిదర్శనమని ఆయన అన్నారు. ఇదే విధంగా పరిశోదనలను కొనసాగించి తక్కువ పెట్టుబడితే అదిక దిగుబడులను సాదించే నూతన వంగడాలను మరిన్ని ఆవిష్కరించేందుకు మరియు రైతాంగానికి అన్ని విదాలుగా అండగా ఉండటానికి, సేవలు అందించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుదని ఆయన అన్నారు. 

                                                                                                                                                                                  ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎ.విష్ణవర్థన రెడ్డి, ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డి, మేనేజింగ్  డైరెక్టర్ డా.శేఖర్ బాబు, ఏపి సీడ్స్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డా.త్రివిక్రమ్,  డైరెక్టర్ ఆఫ్ రిసెర్చు డా.ఎల్.ప్రశాంతి తదితరులు ఈ ఆవిష్కర్ణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

                                                                                                                                                                                            

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image