ఏలూరు జిల్లా (ప్రజా అమరావతి);
*చింతలపూడిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు:-*
*ప్రతి ఒక్కరూ ఇక సైకిల్ ఎక్కాల్సిన సమయం వచ్చింది:- టీడీపీ అధినేత*
*సైకిల్ ఆరోగ్యానికి, ప్రజల ఆదాయానికి మంచిది:- టీడీపీ అధినేత*
• పశ్చిమ గోదావరిలో నాకు ఘనస్వాగతం పలికారు.
• ఈ స్పందన చూసిన తరువాత ఇక ఏ అనుమానం లేదు.
• 2014 ఎన్నికల ఫలితాలు రావడం ఖాయం. అన్నీ సీట్లు గెలవడం ఖాయం
• వైసిపిని బంగాళాఖాతంలో కలిపెయ్యడానికి కారణం..సంక్షేమం పేరుతో ప్రభుత్వం రూ.10 ఇచ్చి...100 రూపాయాలు లాగేస్తోంది.
• వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
• ఒక ముఖ్యమంత్రి సొంత బాబాయి కేసులో విచారణపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
• నాడు వివేకా చనిపోతే గుండెపోటు అని ప్రచారం చేశారు.
• తన తండ్రి హత్యపై కుమార్తె సునితారెడ్డి పోరాటం చేస్తోంది.
• సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. సునితా రెడ్డి చెప్పింది కరెక్ట్ అని తెలంగాణ రాష్ట్రానికి కేసును బదిలీ చేసింది.
• సిగ్గుంటే ముఖ్యమంత్రి దీనిపై రాజీనామా చెయ్యాలి
• దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా లేదా...సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి
• రాజీనామా చెయ్యకపోతే ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపివెయ్యాలి
• సాక్షి గుమస్తా చెప్పాడని...అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే తమ్ముడు నన్ను చంపేస్తా అని చెపుతున్నాడు
• అనుకుని ఉంటే నన్ను, లోకేష్ ను చంపేసే వాళ్లమని వైసిపి వాళ్లు చెపుతున్నారు.
• ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను..ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి...!
• బాబాయిని చంపిన వాడిని పట్టుకోలేని వాళ్లను ఏమనాలి.?
• పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం. దానికోసం నాడు ఎంతో శ్రమించాను.
• నాడు పరిహారం విషయంలో స్టేలు తెచ్చుకుంటే అన్నింటినీ పరిష్కరించి ప్రాజెక్టును పరిగెత్తించాను.
• చింతలపూడిని నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలి.?
• 2019 తరువాత ఒక్క ఉద్యోగం వచ్చిందా....అందుకే ఇప్పుడు జాబు రావాలి...అంటే బాబు రావాలి అని మళ్లీ యువత అంటున్నారు.
• ఈ ముఖ్యమంత్రి నాడు తెచ్చిన మేం తెచ్చిన రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు
• యుతకు ఉపాధి లేకుండా చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏం చెయ్యాలి.?
• జగన్ పాలనలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు.
• ధాన్యం అమ్మి 8 నెలలు అయినా ఈ ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించడం లేదు.
• ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
• పామాయిల్ రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు.
• నాడు మద్దతు ధర ఇచ్చి పామాయిల్ రైతులను ఆదుకున్నాం.
• వచ్చేది తెలుగు దేశం ప్రభుత్వం....ఎవరు తప్పు చేసినా వారి తాట తీస్తా
• పోలీసులు మంచి వాళ్లే...కానీ కొందరు మాత్రం నిబంధనలకు విరుద్దంగా పనిచేస్తున్నారు.
• అన్నింటికీ అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం
• సుదీర్ఘ కాలం నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను...మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాను. కానీ నా పోరాటం రాష్ట్రం కోసం.
• జగన్ రెడ్డి అసత్య ప్రచారంతో నాపై కులం ముద్ర వేసే ప్రయత్నం చేశాడు
• సామాజిక న్యాయానికి మారుపేరు నేను. జీవితాంతం బడుగువర్గాల కోసం పనిచేశా
• విసిలను నియమించినా, టిటిడి పదవులు ఇచ్చినా...అన్ని కులాకు న్యాయం చేసిన పార్టీ టిడిపి
• సిఎం, డిజిపి, చీఫ్ సెక్రటరీ, సలహాదారు సాక్షి గుమస్తా సహా అంతా ఒకే జిల్లా వాళ్లు. ఒకే వర్గం వాళ్లు.
• ఎప్పుడైనా నేను ఇలా చేశానా.....అధికారుల మీద నాకు కోపం లేదు.
• నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా.?
• నేను ఎప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాను.
• అలాంటినాపై ఇష్టాను సారంగా విమర్శలు చేస్తున్నారు.
• పోలవరాన్ని ముంచేసి నేను కారణం అంటున్నారు.
• మద్యం అంతా జగన్ రెడ్డి బ్రాండ్స్....తయారీ, అమ్మకం సహా అన్నీ జగన్ వే కదా
• మద్యపాన నిషేదం అని చెప్పాడు....ఇప్పుడు పెద్ద పెద్ద రిటైల్ షాప్ లు పెట్టి అమ్ముతున్నాడు
• అంటే జగన్ ఏం చేసినా ప్రజలు నమ్మాలా.?
• జగన్ మాయలపై ప్రజలు కర్రలు తీసుకుని రడీగా ఉండాలి. తప్పులు చెప్పే వారిని చితక్కొట్టాలి
• నేను అన్నా క్యాంటీన్ పెట్టాను...పేదలకు కడుపునిండా భోజనం పెట్టే క్యాంటీన్ ను ఈ ముఖ్యమంత్రి తీసేశాడు.
• పది మందికి తిండిపెట్టే అన్నా క్యాంటీన్ పైనా మీ కోపం..? అన్నా క్యాంటీన్ ను మళ్లీ తిరిగి ప్రారంభిద్దాం.
• కుర్చీలు బెంచీలు లేని కార్పోరేషన్లు ఎందుకు....ఒక్కరికి అయినా కార్పొరేషన్ ల నుంచి సాయం చేశారా.?
• వెనుకబడిన వర్గాలు ఆలోచించాలి....ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.?
• వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తా.
• ఎస్సిలకు 28 కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది
• బడుగు వర్గాలను, దళితులను, మైనారిటీలను మోసం చేసిన ప్రభుత్వం ఇది
• విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కింద అంతా పనిచెయ్యాలా....వాళ్ల జాగిరా రాష్ట్రం ఏమన్నా...సామాజిక న్యాయం ఉండదా.?
• రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. వైసిపి నేతలు ఇసుకను దోచేస్తున్నారు.
• చింతమనేనిపై 29 అక్రమ కేసులు పెట్టారు. వేధించారు.
• మరి ఇన్ని అక్రమాలు చేసిన జగన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలి.?
• 40 ఏళ్లు నన్ను ఆదరించిన మీ కోసం నేను పోరాటం చేస్తాను.
• రాష్ట్రం కోసం పోరాటం చేస్తాను...నేను భయపడను.
• నీతి నిజాయితీగా రాజకీయం చేశాను. ఎక్కడా తప్పు చెయ్యలేదు...చెయ్యను
• ప్రజలు కూడా భయపడితే బానిసలుగా మిగిలిపోతారు. తిరగబడకపోతే రాష్ట్ర భవిష్యత్ మిగలదు
• వైసిపి ఎమ్మెల్యేలు దోపిడీ దారులుగా తయారు అయ్యారు. ఇసుక మట్టి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు
• వైసిపి నేతలు పోలీసులు, వాలంటీర్లు లేకుండా బయటకు పోతున్నారా.?
• సిఎం పరదాలు కట్టుకుని పర్యటనలు చేస్తున్నాడు
• ఆడవాళ్ల చున్నీలు నల్లగా ఉన్నాయని సిఎం మీటింగ్ లో వాటిని తీయించాడు
• ఆడవాళ్ల చున్నీలు కూడా చూసి జగన్ భయపడుతున్నాడు
• జగన్ కు ధైర్యం ఉంటే నాలా ప్రజల్లో మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా.?
• పరదాలు కట్టుకుని తిరిగే సిఎం అందరిపై కేసులు పెడుతున్నాడు
• ఇప్పటం వారిపై కేసులు, పవన్ కళ్యాన్ పై కూడా కేసులు పెట్టారు
• ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు...ఇక భయటకు రండి...ధైర్యంగా ఫైట్ చెయ్యండి
• 60 లక్షల మంది ఏకైక సైన్యం ఉన్న పార్టీ తెలుగు దేశం పార్టీ
• తప్పుడు కేసులపై ఏ చెయ్యాలో అదే చేస్తాం
• వైసిపిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని ప్రజలు ప్రతిజ్క్ష చెయ్యాలి
• ప్రభుత్వంపై పోరాడటానికి టీడీపీకి ప్రజలు మద్దతుగా తరలిరావాలి.
• స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నట్లు...నేడు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కదలి రావాలి
• సుప్రీం కోర్టులో రాజధాని గురించి ఏం చెప్పారు. రాజధానిమార్చడం లేదు అని కోర్టుకు చెప్పారు. మూడు రాజధానులు అని ఎందుకు చెప్పలేదు
• మీ ఊళ్లో రోడ్డు వెయ్యలేని సిఎం...రాష్ట్రానికి మూడు రాజధానులు కడతాను అంటున్నాడు.
• ప్రతి ఒక్కరు ఇక సైకిల్ ఎక్కాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యానికి, ఆదాయానికి సైకిల్ మంచిది
• ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ వచ్చింది. ఈ ఫ్యానును నమ్ముకుంటే లాభం లేదు
• ఆ ఫ్యాన్ ను ప్రజలు చితక్కొట్టాలి.
addComments
Post a Comment