విద్యార్థులకు వినూత్న ఆలోచనలు నేర్పాలి

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా

విజయవాడ (ప్రజా అమరావతి);


*విద్యార్థులకు వినూత్న ఆలోచనలు నేర్పాలి


*

- *సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాసరావు గారు*



విద్యార్థులకు వినూత్న ఆలోచనల ద్వారా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు అన్నారు. మంగళవారం సమగ్ర శిక్షా, శ్రీ అరబిందో సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన ‘క్రియేటింగ్ ఎన్ఈపీ – రెడీ రోల్ మోడల్ స్కూల్స్’ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఏపీడీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అరోస్ ఉపకారవేతనం అందుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సున్నా పెట్టుబడితో సృజనాత్మక ఆవిష్కరణలతో కూడిన ‘వినూత్న ఐడియా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి గారు, ప్రొజెక్ట్ ఇన్ క్లూజిన్ డైరెక్టర్  డా. సిమ్మి మహజన్, శ్రీ అరబిందో సొసైటీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డా. టీఎస్.సి. నటరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు  గల విద్యార్థుల కోసం ‘ప్రాజెక్ట్ ఇన్ క్లూజన్’ యాప్ ను ఆవిష్కరించారు.  పాల్గొన్న ఉపాధ్యాయులకు అతిథులు సత్కరించారు.

Comments