విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు


మదనపల్లె, అన్నమయ్య జిల్లా (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యా దీవెన*


*పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు*


*జులై – సెప్టెంబర్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లను మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ఎంపీ, విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, విద్యార్ధులందరికీ నా అభినందనలు. ఒక మంచి కార్యక్రమానికి సీఎంగారు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తున్నారు. 11 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లు ఇవాళ జమ చేస్తున్నారు. నాడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు విద్యార్ధులంతా చదువుకోవాలని ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టారు, దానికి ఇంకా మెరుగులు దిద్దతూ ప్రతి విద్యార్ధి చదువుకోవాలనే లక్ష్యంతో సీఎంగారు పని చేస్తున్నారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు


తీసుకొచ్చారు. ఈ దేశమంతా కూడా ఏపీ వైపు, సీఎంగారి వైపు చూస్తున్నారు, ఏ విధంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారని చూస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం, నాడు నేడు వంటి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఉన్నత విద్యలో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తీసుకొచ్చి చదువులు పూర్తవగానే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్ధులకు శిక్షణనిస్తున్నారు. గత ప్రభుత్వం ఏడాదైనా, రెండేళ్ళయినా ఫీజు రీంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఈ రెండు పథకాలకే రూ. 12,401 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం ఇది. విద్యా శాఖ మంత్రిగా నేను గర్వపడుతున్నాను. జైహింద్‌.


*పి.వి.మిథున్‌ రెడ్డి, ఎంపీ, రాజంపేట*


అందరికీ నమస్కారం, సీఎంగారు చేసిన మంచి గురించి చెప్పాలంటే...గతంలో మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి ఎక్కడ చూసినా కూడా సాగు, తాగు నీరు లేక ఇబ్బందులు పడే పరిస్ధితి, వెయ్యి అడుగులు బోర్లు వేసినా కూడా నీటి లభ్యత లేని ప్రదేశాలు, వర్షాల మీదే ఆధారపడే పరిస్ధితి, సెలైనిటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు అనేక అనారోగ్యాల పాలైన పరిస్ధితులు, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే సీఎంగారి దృష్టికి మేమంతా తీసుకెళ్ళాం, సీఎం గారు వేల కోట్లతో సాగు, తాగు నీరు కోసం అనేక పథకాలు ప్రారంభించారు. హంద్రీనీవాలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో గాలేరు నగరి నుంచి సీఎంగారి సొంత నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి మనకు నీరిచ్చే పరిస్ధితి ఉంది, అక్కడి నాయకులు నీటి సమస్య గురించి చెప్పగా సీఎంగారు అక్కడి బాధలు చూశాను వారికి చేయాలని గాలేరు నగరి అనుసంధానానికి దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చుతో మొదటి ఏడాదిలోనే శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభించారు. మదనపల్లెలో నీటి సమస్య, ఎప్పుడు చూసినా ట్యాంకర్లతో నీరు తెచ్చుకునే పరిస్ధితి, మన సీఎంగారు రూ. 2,400 కోట్లతో రాయచోటి, మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరుకు వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని ఇచ్చారు, దీని ద్వారా గ్రామగ్రామానికి పైప్‌లైన్‌ ద్వారా నీటిని ఇవ్వడమే కాక వచ్చే 30 ఏళ్ళకు కూడా నీటి లభ్యత ఉంటుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉండాలని రూ. 500 కోట్లతో మదనపల్లెలో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నారు. హంద్రీనీవా కాలువ విస్తరించడం వల్ల అన్ని చెరువులు నింపుకునే పరిస్ధితి, దీంతోపాటు పలమనేరు, కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్ధితి ఉందంటే అది సీఎంగారి చలవే. మదనపల్లె నుంచి తిరుపతికి జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం అంటే సీఎంగారు కేంద్రమంత్రి గడ్కరీ గారిని ఒప్పించి ఈ ప్రాంతం అభివృద్ది చేయాలనే సంకల్పం, అనంతపురం నుంచి మదనపల్లెకు వచ్చే జాతీయ రహదారి కూడా సీఎంగారి అభ్యర్ధన మేరకు రూ. 400 కోట్లతో శాంక్షన్‌ అయింది. మంచి చదువులు చదవాలని సీఎంగారు మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నారు. మీరు బాగా అభివృద్ది చెంది జగనన్న పక్కన కూర్చునే స్ధాయికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 


*షేక్‌ మహీర్, విద్యార్ధిని, బీఎస్‌సీ రెండో సంవత్సరం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ (మహిళలు), మదనపల్లె*


గౌరవనీయులైన సీఎంగారికి, అతిధులందరికీ గుడ్‌ మార్నింగ్‌. నాకు ఈ సువర్ణావకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు సీఎంగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీలాంటి గొప్ప ముఖ్యమంత్రిని మేం ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఒక ప్రభుత్వ కాలేజ్‌ విద్యార్ధిగా నేను ఎప్పుడూ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌లో చేస్తానని అనుకోలేదు కానీ మీవల్ల ఇది సాధ్యమైంది. మా సీనియర్‌ విద్యార్ధులు కూడా ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నారంటే దానికి కారణం మీరే. విద్యా వ్యవస్ధలో అనేక మార్పులు తీసుకొచ్చారు, దాంతో సుమారు లక్ష మంది విద్యార్ధులు మైక్రోసాప్ట్, ఒరాకిల్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో ఎన్‌రోల్‌ అయ్యారు. సీఎం సార్‌ మీరు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా, అమ్మ ఒడి, ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధిపొందుతున్నారు. ఏపీ అభివృద్దికి మీరు శాయశక్తులా కృషిచేస్తున్నారు. నేను జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధిపొందాను, విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ పొందాను. అమ్మ ఒడి వల్ల నా తమ్ముడికి లబ్ధి జరిగింది. మా అమ్మ అకౌంట్‌లో ఆ డబ్బులు జమ అయ్యాయి. గతంలో ప్రభుత్వం నుంచి ఏ పథకానికి నిధులు విడుదలైనా లబ్ధిదారుడికి అందడానికి చాలా సమయం పట్టేది, కానీ ఇప్పుడు నేరుగా ఎలాంటి అవినీతి లేకుండా సీఎంగారు రిలీజ్‌ చేయగానే మాకు అందుతున్నాయి. మీరు తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యం అనే వ్యవస్ధను సివిల్‌ సర్వీసెస్‌ సిలబస్‌లో కూడా చేర్చడం గర్వకారణం. అబ్ధుల్‌ కలాం గారు చెప్పినట్లు నిరంతరం నేర్చుకోవడం వల్ల క్రియేటివిటీ వస్తుంది, క్రియేటివిటీ వల్ల నాలెడ్జ్‌ పెరుగుతుంది, నాలెడ్జ్‌ వల్ల గొప్పవారు అవతారు. జగనన్న పథకాల వల్ల ప్రతి ఒక్కరూ లబ్ధిపొంది చివరికి గొప్పవారు అవుతున్నారు. గతంలో ప్రభుత్వ కాలేజ్‌లో చదువులా అన్నవారే ఇప్పుడు ప్రభుత్వ కాలేజ్‌లో చదువును గొప్పగా చూస్తున్నారంటే మీరే కారణం. కార్పొరేట్‌ విద్యకు పోటీగా ప్రభుత్వ విద్యను అందించిన ఘనత మీదే. ధ్యాంక్యూ సీఎం సార్, మీరే ఎప్పుడూ సీఎంగా ఉండాలి, ధ్యాంక్యూ. 


*సౌజన్య, బీఎస్‌సీ నర్సింగ్‌ విద్యార్ధిని, బిల్లూరివారిపల్లి, ములకలచెరువు మండలం*


సార్‌ నేను ఎక్కడ చూసినా జగనన్న, ఏ నోట విన్నా జగనన్న. మీ నామం ప్రజాభివృద్దికి మారుపేరుగా మారింది. మీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రభంజనం, మీరు ఎక్కడ కనపడితే అక్కడ జన సముద్రం, మీరు ఎక్కడ వర్ణిస్తే అక్కడ వర్షం, మీరు ఎక్కడ హర్షిస్తే అక్కడ హర్షం. సార్‌ ఒక మనిషి కోరిక కొన్ని రోజులే బతికిస్తుంది, ఒక మనిషి ఆశ చనిపోయే వరకు బతికిస్తుంది, ఒక మనిషి ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి ఆశయం నేడు మీ రూపంలో మేం అనుభవిస్తున్న ప్రతిఫలం. నేనొక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేను మదనపల్లిలో బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్నాను అంటే కారణం మీరు ప్రవేశపెట్టిన విద్యాదీవెన పథకం, దాదాపు రూ. 27,600 మా తల్లి అకౌంట్‌లో ఏటా వేసి నన్ను చదివిస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు, ఏ విద్యార్ధి డబ్బులేక చదువుకు దూరం కాకూడదని వేల కోట్లు జమ చేసి విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తున్న డేరింగ్, డాషింగ్, డైనమిక్‌ సీఎం. గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మా ముందు నిలిపిన ఒన్‌ అండ్‌ ఓన్లీ సీఎం. ప్రతి గ్రామంలో పట్టణంలో వలంటీర్‌లను నియమించి 72 గంటల్లో పరిష్కరిస్తున్న సీఎం మీరు. కరోనా సమయంలో మా ఇంట్లో నేను మా నాన్న మా అమ్మ ముగ్గురు భాదపడుతుంటే వలంటీర్‌ వచ్చి సేవలందించారు. జగనన్న అంటే పేరు కాదు ఒక నమ్మకం. జగనన్న అంటే ఒక ధైర్యం. ధ్యాంక్యూ జగనన్న.

Comments