సెలూన్ రంగంలోకి రిలయన్స్ను రాకుండా నిలువరించాలి

 సెలూన్ రంగంలోకి రిలయన్స్ను రాకుండా నిలువరించాలి


  కాకినాడ, నవంబర్ 8 (ప్రజా అమరావతి): క్షౌరవృత్తిలోకి (సెలూన్) బడా కంపెనీ సంస్థ రిలయన్స్ రాకుండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య డిమాండ్ చేసింది. మంగళవారం కాకినాడలోని సంఘ కార్యాలయంలో సమాఖ్య సమావేశం జరిగింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సుందరపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ  క్షౌరవృత్తిలోకి రిలయన్స్ సంస్థ రావడం అంటే ఆ వృత్తిదారుల జీవనోపాధికి నష్టం చేయడమెనన్నారు. వృత్తిదారుడు చాలా కష్టాలు పడుతున్నాడని పూట గడవక ఆత్మహత్య చేసుకున్న సంగతిని సుందరపల్లి గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల వృత్తులలో ప్రవేశించకుండా అడ్డుకోవాలన్నారు. ప్రస్తుతం ఈ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత తర్వాత మిగిలిన వృత్తుల్లోకి కూడా ప్రవేశించి వృత్తిదారులకు నష్టం చేకూర్చనున్నారని దీన్నంతా గమనించి రిలయన్స్కు అడ్డుకట్టు వేయాలని సుందరపల్లి చెప్పారు.

   ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు లంక అప్పారావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సత్యనారాయణ, రూరల్ మండల అధ్యక్షుడు కోట ఉమా, వీరబాబు, మాణిక్యం, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments