యూకే మరియు యూరప్ దేశాలలో కన్నులపండుగలా శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు



తాడేపల్లి (ప్రజా అమరావతి);




*యూకే మరియు యూరప్ దేశాలలో కన్నులపండుగలా శ్రీ మలయప్పస్వామి వారి కళ్యాణోత్సవాలు


*


*పత్రికా ప్రకటన విడుదల చేసిన ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి* 



యూకే మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన  తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 13వ  తేదీ వరకు పదకొండు (11) నగరాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహిస్తున్న విషయం విదితమే. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు తిరుమల నుండి తీసుకెళ్ళిన స్వామి, అమ్మవారి మూర్తులకు సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట చేసి  శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పరవశంతో పులకించారు. కళ్యాణోత్సవ అనంతరం తిరుమల నుండి తీసుకెళ్ళిన లడ్డూ ప్రసాదం భక్తులకు అందించడం జరిగింది. తితిదే చైర్మన్ శ్రీ వై.వీ. సుబ్బారెడ్డి సమన్వయ సూచనలతో ఇప్పటికే బేసింగ్ స్టోక్ – ఇంగ్లాండ్ లో బేసింగ్ స్టోక్  తెలుగు సంఘం, మాంచెస్టర్ - ఇంగ్లాండ్ లో శ్రీ వైకుంఠమ్, బెల్ఫాస్ట్ – నార్త్ ఐర్లాండ్ లో నార్త్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్, డబ్లిన్ – ఐర్లాండ్, ఇండో-ఐరిష్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్, జురిక్ – స్విట్జర్లాండ్ లో స్విస్ వేదిక్ భక్తీ ఫౌండేషన్ మరియు ఐండ్ హోవెన్ - నెదర్లాండ్స్ లో SVK, భారతీయ, తెలుగు సంస్థల సహకారంతో ఇప్పటివరకు  06 నగరాలలో శ్రీ మలయప్ప స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించడం జరిగింది. ప్రతి నగరంలోనూ ఆయా కార్యనిర్వాహక వర్గం సభ్యులు భక్తులకు ఎక్కడా, ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల నుండి అపూర్వ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, తితిదే ఛైర్మన్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. 



ఆదివారం (30.10.22) ఐండ్ హోవెన్ లో జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. Stichting Vasudhaiva Kutumbakam (SVK) సంస్థ ముందుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్  అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి యూకే తెలుగు అసోసియేషన్ తో పాటు ఆయా నగరాలలోని తెలుగు, ధార్మిక, భారతీయ సేవా సంస్థలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కళ్యాణోత్సవంలో ఎక్కడా ఏ లోటు రాకుండా సమన్వయము చేస్తూ వచ్చారు. ఈ కళ్యాణోత్సవంలో  ది హేగ్, నెదర్లాండ్స్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం అంబాసిడర్ శ్రీమతి రీనత్ సంధు, శ్రీ సత్య పినిశెట్టి, సెక్రటరీ (ఎకనామిక్స్ & కామర్స్) మరియు బెల్జియం భారత రాయబార కార్యాలయం నుండి అధికారులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలిగినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. శ్రీవారి కళ్యాణోత్సవ క్రతువును SVBC ప్రత్యక్ష ప్రసారం చేసింది. APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ శ్రీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అక్కడి కార్యనిర్వాహకవర్గం శ్రీ సత్యప్రసాద్ కిల్లి,  శ్రీ. శివరామ్ తడిగొట్ల, ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీ  కార్తీక్,  SVK సభ్యులు కళ్యాణోత్సవం సజావుగా సాగేలా సమన్వయము చేసారు. శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణంలో స్థానిక తెలుగు, భారతీయ భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని, దీనికి ఏపీఎన్ఆర్టీఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని శ్రీ మేడపాటి అన్నారు. నవంబర్ నెలలో మరో 5 నగరాలలో శ్రీవారి కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image