డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);
*దక్షిణ భారతదేశం నుండి జాతీయ స్థాయి లాన్ టెన్నిస్, కుస్తీ పోటీ లో పతకాలు సాధించిన ఎపి పోలీస్ క్రీడకారులను అభినందించి, నగదు బహుమతిని అందించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి
*
*నోట్:1*
నవంబర్ 15th నుండి 18th వరకు ఢిల్లీలోని ఆర్కే కన్నా స్టేడియంలో సిఆర్‌పిఎఫ్ అధ్వర్యంలో నిర్వహించిన 23వ ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ పోటీలలో మొత్తం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన 125 మంది క్రీడకారులు పాల్గొన్నాయి. ఐజి ఎల్.కే.వి రంగారావు, క్రీడలు & సంక్షేమం నేతృత్వం లోని క్రీడాకారుల బృందం ఇందులో పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన *డిఎస్పీ ఎన్.టి.వి రాంకుమార్ సింగిల్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాదించారు. అదే విధంగా డబుల్స్ విభాగంలో అడిషనల్ ఎస్పీలు సత్యనారాయణ, కోటేశ్వరరావు వెండి పతకాన్ని* సాదించారు.
1. N.T.V. Ram Kumar (DSP)- SINGLES *GOLD MEDAL*
2. B. Satya Narayana (Addl.sp) & K.Koteshwara Rao (Addl.sp) Doubles *SILVER MEDAL*
*నోట్:2*
నవంబర్ 14th నుండి 20వ తేదీ వరకు మహారాష్ట్ర పోలీస్ అధ్వర్యంలో పుణె లో నిర్వహించిన 71st ALL INDIA POLICE WRESTLING(కుస్తీ పోటీ) CLUSTER-2022 పోటీలలో మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన జట్లు పాల్గొన్నాయి.ఈ కుస్తీ పోటీలో ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి జిల్లా కు చెందిన పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ బి.నూకరాజు(pc-2145) BRONZE MEDAL ను సాదించాడు.
23వ ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ పోటీలు, 71st ALL INDIA POLICE WRESTLING(కుస్తీ పోటీ) CLUSTER-2022 పోటీలలో ఉత్తమ ఆటతీరుతో పతకాలు సాదించిన పోలీస్ క్రీడకారును మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో అభినందించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, అనంతరం వారికి నగదు బహుమతిని అందజేశారు.ఈ కార్యాక్రమంలో ఐజి ఎల్.కే.వి రంగారావు, క్రీడలు & సంక్షేమం, స్పొర్ట్స్ అధికారి కే.వి. ప్రేమ్ జిత్ పాల్గొన్నారు.
addComments
Post a Comment