ఎస్ జి ఎస్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్ – టీటీడీ చైర్మన్, ఈవో ద్వారా పత్రాలు అందుకున్న ప్రిన్సిపాల్

 ఎస్ జి ఎస్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్

– టీటీడీ చైర్మన్, ఈవో ద్వారా పత్రాలు అందుకున్న ప్రిన్సిపాల్


తిరుమల 30 నవంబరు (ప్రజా అమరావతి): టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ గోవింద రాజ స్వామి జూనియర్ కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఇటీవల కళాశాలను సందర్శించిన న్యాక్ కమిటీ ఈ మేరకు పత్రాలను టీటీడీ కి పంపింది. బుధవారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో టీటీడీ జేఈవో (విద్య, వైద్యం) శ్రీమతి సదా భార్గవి, కళాశాల అధ్యాపకులను అభినందించారు. డి ఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, డిప్యూటి ఈవో శ్రీ గోవింద రాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments