నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసు పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది



నెల్లూరు నవంబర్ 24 (ప్రజా అమరావతి);


నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసు పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంద


ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.



రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్యులు  నగరంలోని వారి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.



ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసు పై అనేక రకాల కథనాలు ప్రసారం అయ్యాయని, తనపై  వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చాయని చెప్పారు. విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అందరి అభిప్రాయాలను అడిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉందని చెప్పడం జరిగిందన్నారు.


సిబిఐ విచారణకు గౌరవ హైకోర్టు ఆదేశిస్తే ఎటువంటి అభ్యంతరాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం  చెప్పిందన్నారు. 


అంతేకాకుండా వ్యక్తిగతంగా తనకు సంబంధించిన అడ్వకేట్ హైకోర్టుకు హాజరై సిబిఐ ద్వారా విచారణ చేపట్టేందుకు ఎటువంటి అభ్యంతరం  లేదని కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు.


దీంతో రాష్ట్ర హైకోర్టు నెల్లూరు జిల్లా కోర్టు లో చోరీ సంఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించిందన్నారు.


ఆ కోర్తు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. దేశంలోని  అత్యుత్తమమైన సంస్థ సీబీఐ అని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో ప్రజా జీవితంలో ఉండే వారిపై ఎవరైనా సరే ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉందన్నారు.


సిబిఐ విచారణ ద్వారా ప్రజలకు పారదర్శకంగా వాస్తవ విషయాలు తెలుస్తాయన్నారు.


ఇది సున్నితమైన అంశం అని రాష్ట్ర హైకోర్టు, విచారణ సంస్థల పరిధిలో ఉన్నందున స్పష్టత ఇవ్వడానికే తాను మీడియా ముందుకు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

Comments