రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే చంద్రబాబు కల

 *- రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే చంద్రబాబు కల*


 *- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ప్రారంభం* 

 *- ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు* 

 *- చంద్రబాబు హయాంలోనే నదుల అనుసంధానం* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


దెందులూరు/ చింతలపూడి, నవంబర్ 30 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే నారా చంద్రబాబునాయుడు కల అని, ఆయన హయాంలోనే నదుల అనుసంధానం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు జరిగే చంద్రబాబు పర్యటనలో శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్ షో చేసేందుకు వాహనం పైకి ఎక్కుతున్న సమయంలో శిష్ట్లా లోహిత్ తో చంద్రబాబు కొద్దిసేపు మాట్లాడారు. ముందుగా హనుమాన్ జంక్షన్ ఊరి బయట చంద్రబాబునాయుడకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. బైక్ ర్యాలీలతో టీడీపీ శ్రేణులు హెూరెత్తించారు. దీంతో బొమ్ములూరు వద్ద చెన్నై-కోల్ కతా రహదారి ట్రాఫిక్ తో స్తంభించిపోయింది. కలపర్రు టోల్ గేట్ దగ్గర నుండి పర్యటనను ప్రారంభించిన చంద్రబాబు విజయరాయి వద్ద బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' అనే కార్యక్రమాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుండి దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల సరిహద్దు గ్రామం రామచంద్రాపురంలో రైతులతో చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత చింతలపూడిలో రోడ్ షోను నిర్వహించారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలోనే పామాయిల్ సాగుకు బీజం పడిందన్నారు. మలేషియా నుండి పామాయిల్ విత్తనాలను తీసుకువచ్చి ఇక్కడ నర్సరీని ఏర్పాటు చేసి పామాయిల్ సాగును ప్రోత్సహించడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో పామాయిల్ ధరలు పడిపోతే రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర కల్పించారన్నారు. పామాయిల్ సాగుకు మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ ను అందుబాటులోకి తెచ్చారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ధాన్యాగారంగా ఉన్న గోదావరి జిల్లాల్లో వరికి గిట్టుబాటు ధర రాని దుస్థితి ఉందన్నారు. గోదావరి జిల్లాల్లో రెండు పంటలకు నీళ్ళు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని అన్నారు. ఆక్వా కల్చర్ అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరే పరిస్థితి లేదన్నారు. విద్యారంగంలో నాణ్యత కన్పించడం లేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. రాష్ట్రానికి 'ఇదేం ఖర్మ' అంటూ చంద్రబాబు ఆవేదన చెందారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments