కడియం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఎండి వీర పాండ్యన్



రాజమహేంద్రవరం / కడియం  (ప్రజా అమరావతి);



కడియం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఎండి వీర పాండ్యన్ 




ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంట కు మద్దతు ధర కల్పించి మరింత భరోసా ఇచ్చే క్రమంలో నూతన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల మేనేజింగ్ డైరెక్టర్ జీ. వీర పాండ్యన్ పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం కడియం లోని రైతు భరోసా కేంద్రం లోని కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి తనిఖీ చేసి, రైతులతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా ఎండి వీర పాండ్యన్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా దళారుల, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడం కొన్ని కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఆచరణ లోకి తీసుకుని వచ్చామని తెలిపారు. వాటి అమలు తీరు, రైతుల సాధక బాధకాలు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం లో క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్నట్లు తెలిపారు.  అందులో భాగంగా గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వ్యవస్థ ను రైతే సమకూర్చుకుంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని వీర పాడ్యంన్ రైతులకు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుంచి రైతు చెల్లించిన ప్రతి ఒక్క రూపాయి 21 రోజుల్లో చెల్లింపులు చెయ్యాలని ముంఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుని చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం చేపట్టిన సంస్కరణ ల పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారని తెలియచేశారు. గతంలో కంటే రైతులకు ఎకరాకు రూ. ఆరు వేలు ఎక్కువగా అందుతోందని తెలిపారు.  గన్ని బ్యాగులు, హమాలీలు, రవాణా సదుపాయం రైతు సమకూర్చుకోక పోతే జిల్లా యంత్రాంగం వాటిని ఏర్పాటు చేస్తుందని రైతులతో అన్నారు. 


పర్యటన లో భాగంగా రికార్డుల నిర్వహణ, ధాన్యం సేకరణ, డేటా నమోదు, తేమ శాతం, తదితర అంశాలపై అర్భికే సిబ్బంది చేపడుతున్న పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ప్రతిఒక్క పంట వివరాలు, క్వాలిటీ, క్వాంటిటీ, రైతు వివరాలు, బ్యాంకు వివరాలు తో కూడి సక్రమంగా సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. 


ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. ప్రసాద్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా మేనేజర్ (సి ఎస్) ఆర్. తనూజా, మండల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments