తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది

 *తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది


*


*ఘట్టమనేని కృష్ణ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం*


అమరావతి (ప్రజా అమరావతి): తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Comments