రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
** ఓటరు నమోదు ప్రక్రియలో స్థిరత్వం ఉండాలి.
** ప్రతి పోలింగ్ కేంద్రాల ద్వారా జనాభా లెక్కల నిష్పత్తి ఓటరు నమోదు ఉండాలి.
**రాజకీయ పార్టీలు కూడా ఓటరు నమోదు కార్యక్రమం విరివిగా భాగస్వామ్యం కావాలి.
.. జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్" డా.పి.భాస్కర..
జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమంలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా చేసుకోవాలని తద్వారా స్వచ్చిలతతో కూడిన ఓటరు జాబితా రూపకల్పన లో భాగస్వామ్యం కావాలని తూర్పు గోదావరి జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్" డా.పి.భాస్కర , జిల్లా కలెక్టర్ డా కే.మాధవీ లత పేర్కొన్నారు.
బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిశీలకులు పోలా భాస్కర మాట్లాడుతూ, ఓటరు జాబితా రూపు దిద్దుకున్న క్రమంలో మార్గదర్శకాలు కి అనుగుణంగా జరుగుతున్నది? లేనిది? క్షేత్ర స్థాయి లో పరిశీలన చెయ్యడం జరుగుతున్నదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటరు నమోదు అత్యంత కీలకం అన్నారు. ఎన్నికల ముందు జరిగే ఓటరు నమోదు, జాబితా సవరణ సందర్భాల్లో రాజకీయ పార్టీలు చూపే ఆసక్తి, ప్రతి ఏడాది చేపట్టే ప్రక్రియలో చూపక పోవడం జరుగుతున్న వాస్తవం అన్నారు. రాజకీయ పార్టీలకు పోలింగ్ కేంద్రాల వారిగా ఓటరు జాబితా ఇవ్వడం జరుగుతుందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్చికరణ తో కూడిన ఓటరు జాబితా ప్రకటన లో రాజకీయ పార్టీల బాధ్యత కీలకం అన్నారు. మరణించిన, వివాహం జరిగి, ఉద్యోగం వేరే చోటుకు వెళ్ళిన వారు పాత పోలింగ్ కేంద్రాలలో ఓటరు గా కొనసాగే సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నామని ఆయన అన్నారు. ఓటరు జాబితా లో ఉన్న తప్పులు లేకుండా చూసుకోవాలసి ఉందన్నారు. ఓటరు నమోదు, చేర్పులు, కూర్పులు సక్రమంగా అమలు చేయడం లో కేవలం అధికారులనే తప్పు పట్టడం జరుగుతున్న వాస్తవం అన్నారు. ఓటరు ఇక్కడ ఉండడం లేదనీ స్థానిక రాజకీయ పార్టీ లకు చెందిన కార్యకర్తలకు తెలిసినా కూడా చెప్పక పోవడం జరుగుతోందని భాస్కర తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు కు డిసెంబర్ 8 వ తేదీ వరకు క్లైయిమ్స్ మరియు అభ్యతరం తెలియ చేపట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ఓటరు నమోదు చేయండం లో కొన్ని లోపాలు ఉన్నాయని, 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు కల్పించే దిశగా మరింతగా అవగాహన అవసరం అన్నారు. కళాశాలలో చదివే ప్రతి ఒక్కరికీ అవగాహన కోసం స్పెషల్ అధికారిని నియమించి 223 ప్రభుత్వ , ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న సుమారు లక్షా అరవై వేల మంది ఉన్నారని, వారందరికీ ఓటు హక్కు కోసం ధరఖాస్తు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరణించిన, సంచార ఓటరు విషయం లో పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో పోలింగ్ కేంద్రం ప్రాథమిక గుర్తింపు నిచ్చే ప్రాంతం అని పేర్కొన్నారు. ఓటరును తొలగించే క్రమంలో సరైన ఆధారం తో కూడి మాత్రమే అట్టి ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఓటరు కార్డు లలో ఓటరు ఫోటోలు సరిపోక పోవడం మరో కీలక పరిణామం అన్నారు. ఇటువంటి ఘటనలు యంత్రాంగం యొక్క పనితీరు లోపంగా భాస్కర అన్నారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని , మార్గదర్శకాలు పలు సార్లు చదివి పునచ్చరణ చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో స్త్రీ, పురుష నిష్పత్తి పోలింగ్ కేంద్రాల ఆధారంగా సమీక్ష చేసుకొని అధ్యయనం చేయడం ముఖ్యం అని స్పష్టం చేశారు. మిస్ మ్యాచ్, డుప్లికేషన్ ఓటరు ను జాబితా నుంచి తొలగించడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, 2023 జనవరి ఒకటిన ప్రచురించే ఓటరు జాబితా అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని నియోజక వర్గాలకు ఎలెక్టోరోల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించడం జరిగిందని, రాజానగరం నియోజక వర్గం నకు పోలవరం ప్రాజెక్టు చెందిన అధికారిని నియామకం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో 66.70 శాతం మంది ఓటర్ల ను ఆధార్ తో అనుసంధానం చేశామన్నారు. ఓటరు జాబితాలో స్త్రీ, పురుష రేషీయో పై సమగ్రంగా అధ్యయనం చేసి పారదర్శకంగా ఓటరు జాబితా ప్రకటన చేసే నాటికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక మేరకు తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. స్వీప్ కార్యక్రమం ద్వారా మరింతగా ప్రజల్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్ వో జీ. నరసింహులు, నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులు , మండల ఓటరు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు వైయస్ఆర్ పార్టీ తరపున కామేశ్వరరావు, టిడిపి తరపున ఏ. గోవింద్, మజ్జి రాంబాబు, బిజెపి..బి. రామచంద్రరావు, సిపిఐ టి. మధు, కాంగ్రెస్ పార్టీ..సిహెచ్. మురళి కృష్ణ, సిపిఎం- పి రామకృష్ణ, బహుజన సమాజ్ పార్టీ పి వి. కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా
అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(లు), గెయిల్ (ఇండియా) లిమిటెడ్,
రాజమహేంద్రవరం ఏబీవీఎస్బి శ్రీనివాస్, రాజానగరం కి ప్రత్యేక కలెక్టర్ (ఎల్ ఏ), పి. ఐ.పి. రాజమహేంద్రవరం , రాజమహేంద్రవరం అర్బన్ కి మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం గ్రామీణ కి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి, కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, నిడదవోలు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం తెం. రాజు
addComments
Post a Comment