రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు విజయవతంగా అమలుకు కృషి

 రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మల్లాది విష్టు

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు విజయవతంగా అమలుకు కృషి


17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి

అణగారిన వర్గాల సామాజిక ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా ప్రణాళికాబోర్డు పనిచేస్తుంది

గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా నవరత్నాలు సక్రమ అమలుకు కృషి

ప్లానిగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు

అమరావతి,11 నవంబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రణాళికా బోర్డు పనిచేస్తుందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.శుక్రవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఆయన వేద పండితుల ఆశ్వీర్వచనాలు మరియు గన్నవరం శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ దివ్య ఆశీస్సులతో ఆయన నూతన చాంబరులో ప్రవేశించి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్లానిగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అణగారిన వర్గాల సామాజిక ఆర్ధికాభ్యున్నతే ధ్యేయంగా ప్లానింగ్ బోర్డు పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా నవరత్నాల పధకాలను ప్రణాళికాబద్ధంగా విజయవతంగా అమలు చేసి ఆయా పధకాల ప్రయోజనాలు ప్రతి లబ్దిదారునికి అందేలా ప్లానిగ్ బోర్డు కృషి చేస్తుందని పేర్కొన్నారు.అదే విధంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తనవంతు కృషి చేస్తానని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు స్పష్టం చేశారు.

జాతిపిత మహత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూనలకు ప్రభుత్వం అమలు చేస్తున్ననవరత్నాలు పధకాలను,ఇతర అభివృద్ది సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రణాళికా బోర్డు ప్రయత్నం చేస్తుందని ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.వివిధ అభివృద్ధి పధకాలు అమలులో ఆర్ధికాభివృద్ధి స్థాయిలను పర్యవేక్షించడం తోపాటు వాటి మూల్యాంకనం చేయడంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు.అంతేగాక వివిధ పధకాల సక్రమ అమలు చేయడం,ప్రణాళిక అమలులో ప్రతి దశలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడు నిర్ధారించడంతో పాటు ఆయా విధానాలు సర్దుబాట్లకు వీలుగా ఆయా శాఖలు,విభాగాలకు ప్రణాళికాబోర్డు తగిన సూచనలు,సలహాలను అందిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల సమగ్రాభివృద్ధికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు సకాలంలో రాబట్టేందుకు ప్రణాళికా బోర్డు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి శాసన సభ్యునికి 2కోట్ల రూ.లు వంతున విడుదల చేసే నిధులతో చేపట్టే పనుల పర్యవేక్షణను చూస్తుందని ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టు పేర్కొన్నారు.అంతేగాక రాష్ట్రంలో వ్యవసాయం,విద్య,వైద్య,ఇంధన,మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాల్లో ప్రణాళికాబోర్డు ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వివిద అంశాలను ఈప్రభుత్వం ముందుకు తీసుకువెళుతూ అన్ని అభివృద్ధి సంక్షేమ పధకాలను ఒక ప్రణాళికాబద్దంగా అమలు చేయండం ద్వారా పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్ష్యులు మల్లాది విష్టు పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులు జోగి రమేశ్,శాసన సభ మాజీ ఉప సభాపతి కోన రఘుపతి,రాష్ట మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి,రాష్ట్ర ప్రణాళికా శాఖకు చెందిన పలువులు అధికారులు,విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్టుకు పూల గుచ్చాలు అందించి శుభా కాంక్షలు తెలియజేశారు.

    

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image