నెల్లూరు (ప్రజా అమరావతి);
సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అన్ని రకాల చేయూత అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
శనివారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవిత కేంద్రాలలో గల ప్రత్యేక అవసరాలు గల 394 మంది పిల్లలకు 19.07 లక్షల రూపాయల విలువగల 6 రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంబంధించి ఇలాంటి అత్యున్నత కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయ
మన్నారు. చిన్న చిన్న లోపాలతో పుట్టిన పిల్లలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారు కూడా సమాజంలో సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించేందుకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యేకించి చదువుకున్న వయసులో వీరికి అండగా నిలిస్తే భవిష్యత్ లో సాధారణ వ్యక్తులతో పోటీపడి వారికంటే మిన్నగా సమాజంలో జీవనం సాగించే అవకాశం కలుగు తుందన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వైద్య శిబిరాలు, శస్త్ర చికిత్సలతో పాటు ఉచితంగా ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, రోలటర్, సి.పి. చైర్స్, వినికిడి సహాయ పరికరాలు, ఉతకర్రలు మొత్తం ఆరు విభాగాలకు సంబంధించి 394 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఈ రోజు సమగ్ర శిక్ష అధ్వర్యంలో ఉపకరణాలను అందించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సానుభూతి కంటే వారికి అండగా వుంటూ వారి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు అధిక మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. నేడు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో నాడు – నేడు కార్యక్రమం కింద అన్నీ స్కూల్స్ ను అభివృద్ది చేయడం జరుగుచున్నదన్నారు. అన్నీ వర్గాల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో దివ్యాంగులకు, వారిలో దివ్యాంగులం అనే భావం రాకుండా అందరితో సమానంగా చూడవల్సిన బాధ్యత మనపై వుందన్నారు. వారి సంక్షేమానికి మరింత చేయూత అందించేందుకు మరియు వారికి అవసరమైన ఉపకరణాలను గుర్తించడానికి రానున్న రోజుల్లో గ్రామ, మండల స్థాయిలో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి వారి భవిష్యత్ కు తోడ్పాటు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మానాధ్, జడ్పీ సీఈఓ శ్రీ చిరంజీవి, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్స్ శ్రీ రామలింగం, శ్రీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి సిహెచ్ ఉషారాణి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏ.డి శ్రీమతి నగరాజకుమారి, శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment