పంచాయితీ రాజ్ శాఖకు చెందిన గ్రేడ్-V పంచాయతీ కార్యదర్శులు ఎవరికి డబ్బులు చెల్లించవద్దు.

తాడేపల్లి (ప్రజా అమరావతి);    పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుండి పంచాయతీరాజ్ శాఖకు చెందిన గ్రేడ్ -V  పంచాయితీ కార్యదర్శులకు డి డి ఓ అధికారాలు కల్పించే విషయమై కొంతమంది వ్యక్తులు అసోసియేషన్ పేరుతో అనధికారికంగా సదరు ప్రతిపాదన ఆమోదము పేరిట ఖర్చులు అవుతాయని సదరు ఖర్చులకు గ్రేడ్-V పంచాయతీ కార్యదర్శుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఈ కార్యాలయం దృష్టికి వచ్చింది. సదరు విషయమై అందరికీ తెలియజేయునది. ఏమనగా డి డి ఓ అధికారాలు కల్పించే విషయంలో కానీ మరియు పంచాయతీరాజ్ శాఖలో జారీ చేయబడుచున్న అన్ని కేడర్లకు సంబంధించిన పదోన్నతుల విషయంలో కానీ బదిలీలు మరియు క్రమశిక్షణకు సంబంధించిన కేసులు విషయంలో కానీ మరియు ఇతరత్రా ఎటువంటి ప్రతిపాదనల ఆమోదము కొరకు గానీ ఏ పంచాయతీ కార్యదర్శి లేదా పంచాయతీ రాజ్ శాఖలోని ఇతర ఉద్యోగులు గాని ఎటువంటి డబ్బులు ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు. పై విషయమునకు సంబంధించి ఈ విధముగా ఎవరైనా డబ్బులు వసూలు చేసిన లేదా డబ్బులు ఇచ్చినా సదరు వ్యక్తులు పేర్లు ఈ కార్యాలయము దృష్టికి వచ్చినట్లయితే తక్షణమే సదరు వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కనుక ఏ పేరుతో ఏ విధముగా నైనా ఈ శాఖలో డబ్బులు వసూలు చేసినట్లయితే ఉత్పన్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ సదరు విషయమును పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడమైనది.

Comments