ఒక్కొక్క ఇంటికి అదనంగా రూ 15 వేల రూపాయలు ఆర్థిక సాయం

 

నెల్లూరు, డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):  సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్లు మంజూరైన గిరిజనులకు అండగా ఉండి, సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్క ఇంటికి అదనంగా రూ 15 వేల రూపాయలు ఆర్థిక సాయం


అందజేస్తున్నట్లు  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


శుక్రవారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని  ముత్తుకూరు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జరిగిన  కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పాల్గొని  జగనన్న ఇంటి నిర్మాణ పధకం క్రింద ఎస్టి లబ్ధిదారులకు   ఆర్ధిక చేయూత కింద ఒక్కొక్క లబ్ధిదారునికి 15 వేల రూపాయల వంతున చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్.సి.,ఎస్.టి., బి.సి, మైనారిటీ వర్గాలకు అండగా వుంటూ, వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున  ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు.  పేదవాని సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో  గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇంటి పట్టాల మంజూరుతో పాటు  ఇల్లు నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.  ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం  1.80 లక్షల రూపాయలు  వంతున  ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్ధిక సహాయం అందచేస్తున్నప్పటికినీ, సర్వేపల్లి నియోజకవర్గంలో ఆర్ధికంగా వెనుకబడిన ఎస్.టి లబ్ధిదారులను గుర్తించి, వారు త్వరగా ఇల్లు నిర్మించుకునేలా అదనంగా మరో 15 వేల రూపాయలు  ఆర్ధిక సహాయం అందచేసే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.   ప్రతి గిరిజన కుటుంబం త్వరగా ఇల్లు నిర్మించుకునేందుకు  దాతలు సహకారం, సిఎస్ఆర్  నిధులతో ఒక్కొక్క కుటుంబానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.  ముత్తుకూరు మండల పరిధిలో  170 మంది ఎస్టి లబ్ధిదారులకు రూ.25.50 లక్షలు ఆర్థిక సాయం చేసినట్లు  మంత్రి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం లో ఇప్పటివరకు సుమారు 900 గిరిజన కుటుంబాలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 15 వేల రూపాయల సాయం అందజేసినట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయంతో పాటు అదనంగా అందచేస్తున్న 15 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని మంత్రి ఈ సంధర్భంగా ఎస్.టి లబ్ధిదారులకు సూచించారు. 


ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుగుణమ్మ, జడ్పిటిసి వెంకటసుబ్బయ్య, హౌసింగ్ పీడీ నాగరాజు, ఎంపీడీవో ప్రత్యూష, తహసీల్దార్ మనోహర్ బాబు,  గృహ నిర్మాణ శాఖ డిఈ శ్రీ  వరప్రసాద్,  వివిధ శాఖల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మండల పరిధిలోని  వివిధ గ్రామాలకు చెందిన ఎస్టి గృహ నిర్మాణ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments