వివిధ కళారూపాలకు చెందిన మొత్తం 263 మంది కళాకారులు జోనల్ స్థాయి ప్రదర్శన లో పాల్గొన్నారు రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


 * జగనన్న స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా  మూడవ రోజు  వివిధ కళారూపాలకు  చెందిన మొత్తం 263 మంది కళాకారులు జోనల్ స్థాయి ప్రదర్శన పాల్గొనగా .. మొత్తం మూడు రోజులకు గాను  ఏకపాత్రధారి(సోలో ) 583  మంది, గ్రూపు సభ్యులుగా 138 బృందాల్లో 883 మంది మొత్తం 1456 మందికళాకారులు  పాల్గొన్నారని గురువారం భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లిఖార్జున రాజు  తెలిపారు.  


జగనన్న స్వర్ణోత్సవ సంబరా లలో భాగంగా రెండవ రోజు బుధవారం వివిధ కళారూపాలకు చెందిన  263 మంది కళాకారులు జోనల్ స్థాయి కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో ప్రదర్శనలు చేసి ఆహుతులను అలరించారని భాషా సాంస్కృతిక శాఖ, సంచాలకులు, ఆర్. మల్లిఖా ర్జున రావు గురువారం సాయంత్రం తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా  నృత్య ప్రదర్శన విభాగం కు కృష్ణకుమార్, సిహెచ్. శ్రీ లక్ష్మీ దేవి, సంగీత విభాగంకు  వి. సరస్వతి, యం. బాల విజయలక్ష్మి, జానపథ విభాగంకు యడ్ల వెంకటరావు, భాగవతుల మోహన్ రావు  సాంస్కృతిక ప్రదర్శనల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.  సాంస్కతిక సంబరాల్లో మూడవ రోజు ప్రదర్శన కళాకారులకు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి సిహెచ్ శ్రీనివాస్, డిపిఆర్వో ఐ.కాశయ్య, మ్యూజిక్ కళాశాల ప్రిన్స్ పాల్ యం. కృష్ణమోహన్ మెమెంటో, శాలువాతో సత్కరించారు. 

మూడవ రోజు ప్రదర్శన కళాకారులు...

 మూడవ రోజు  ఏక పాత్రిదారులుగా (సోలో) 104 మంది, 24 బృందాల్లో 159 మంది మొత్తం 263  కళాకారులు పాల్గొన్నారు.


 కళారూపాలు వారి బృంద వివరాలు.. 


 కూచిపూడి నృత్య ప్రదర్శన ..


ఏకపాత్రధారి(సోలో) 40 మం ది, గ్రూపు సభ్యులుగా 6 బృం దాల్లో  38 మంది మొత్తం 78 మందికళాకారులు పాల్గొన్నారు.


 భరత నాట్యం.. ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో ) 26 మంది, గ్రూపు సభ్యులుగా 4 బృందాల్లో  19 మంది మొ త్తం 45మందికళాకారులు పాల్గొన్నారు.


 ఆంధ్ర నాట్యం ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో ) 3 గురు కళాకారులు  పాల్గొ న్నారు.


 కర్ణాటక గాత్ర  ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో) 16  మంది, గ్రూపు సభ్యులుగా 1 బృందాల్లో  9 మంది మొత్తం 25 మందికళాకారులు పాల్గొ న్నారు.


 ఫోక్ గ్రూప్ ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో ) 6  మంది, గ్రూపు సభ్యులుగా 5 బృందాల్లో  41 మంది మొత్తం 47 మందికళాకారులు పాల్గొ న్నారు.


 ఫోక్ సాంగ్స్ ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో )  11 మంది, గ్రూపు సభ్యులుగా 2 బృందాల్లో  12 మంది మొత్తం 23 మందికళాకారులు పాల్గొ న్నారు.


 జానపద నృత్య ప్రదర్శన.. 


ఏకపాత్రధారి(సోలో ) 2  మంది, గ్రూపు సభ్యులుగా 6 బృందాల్లో  40 మంది మొత్తం 42 మందికళాకారులు పాల్గొ న్నారని మల్లిఖా ర్జున రావు తెలిపారు.


జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో మొత్తం మూడు రోజులకు గాను  ఏకపాత్రధారి(సోలో) 583  మంది, గ్రూపు సభ్యులుగా 138 బృందాల్లో 883 మంది మొత్తం 1456 మందికళాకారులు  పాల్గొన్నారని భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మల్లిఖార్జున రాజు తెలిపారు.  


Comments