తెనాలి (ప్రజా అమరావతి);
తెనాలిమున్సిపల్ స్కూలుకు రాష్ట్ర స్థాయిలోస్వఛ్ఛవిద్యాలయ అవార్డు
తెనాలి మునిసిపాలిటీ లోని బుర్రిపాలెం రోడ్డులోని BC కాలనీలోని వేజళ్ల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాధమిక పాఠశాలకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం లభించటం అభినందనీయమని తెనాలి ఛైర్మన్ ఖాలేదా నశీం అన్నారు.రెడ్ క్రాస్ సంస్థ తెనాలివారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె మఖ్య అతిథిగా హాజరై పాఠశాల హెడ్ మాష్టర్ టీచర్లకు అభినందనలు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ తెనాలి నార్వాహకులు ముమ్మనేని భానుమతి తెనాలి పాఠశాలకు స్వఛ్ఛవిద్యాలయ అవార్డు రావటం తమకు ఆనందంగాఉందని దీనిని పురస్కరించుకొని సిబ్బందిని అభినందిస్తూ విద్యార్థులకు Hand wash సబ్బులు మాస్కులు బిస్కెట్ పాకెట్లను అందచేశారు.
ఈ కార్యక్రమంలో హెడ్ మాష్టర్ బసవేశ్వరరావు, రెడ్ క్రాస్ శ్రీమన్నారయణ పాఠశాల టీచర్లు పాల్గొన్నారు,
addComments
Post a Comment