ఇది నిరుపేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం



*ఇది నిరుపేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం



*ప్రేమ, అనురాగం, వాత్సల్యంతో పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి* 


*భారత దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా ఎస్.సి, ఎస్.టి లకు ప్రత్యేక స్మశాన వాటికలు ఏర్పాటుకు జి ఓ జారీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రిదే* 


                 *: ఉప ముఖ్యమంత్రి*

 

*పేదరికం అనే అర్హతను ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాల అమలు* 


*ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మందికి రూ. 590.91 కోట్లు లబ్ది చేకూర్చిన ముఖ్యమంత్రి*



   *: గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖమాత్యులు*


*జిల్లాలో 48,590 మందికి రూ.70.49 కోట్లు లబ్ది*

 

                   *: ఇంచార్జ్ కలెక్టర్*


చిత్తూరు, డిసెంబర్ 27 (ప్రజా అమరావతి): పేద ప్రజల పై ప్రేమ, అనురాగం, వాత్సల్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా పథకాలను ప్రవేశపెట్టారని, ఇది నిరుపేదల ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు శ్రీ కె. నారాయణస్వామి తెలిపారు. 


           ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకాల అమలులో భాగంగా రెండవసారి లబ్దిదారులకు చేకూర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం తాడేపల్లెలోని తన క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 


           ఈ కార్యక్రమానికి జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖమాత్యులు డా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌ. చిత్తూరు ఎం.పి ఎన్.రెడ్డప్ప, గౌ.జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్రరెడ్డి, ఇంచార్జి కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు నగర మేయర్ అముద, ఆర్టిసి వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, డిఆర్డిఏ పిడి తులసి, మెప్మా పిడి రాధమ్మ, జడ్పీ సిఈఓ ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఆర్డిఓ రేణుక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బానీ భాష, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, ప్రజా ప్రతినిధులు, తదితరులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


        ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ* ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకం అమలులో భాగంగా నగదును రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి అర్హుల ఖాతాలకు చేసారని తెలిపారు. అర్హులను గుర్తించడంలో జిల్లా కలెక్టర్లు చిత్తశుద్ధితో పని చేసినందుకు గానూ ముఖ్యమంత్రి వారిని అభినందించారని తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేయడంలో భాగంగా జిల్లాలో 2,670 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతున్నదని తెలిపారు. 300 యూనిట్లు అంతకంటే పైబడి విద్యుత్ వినియోగం జరిగి ఉంటే అట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నదని, అపోహలను నమ్మవద్దని, లోటు పాట్లు ఉన్న యడల వాటిని సవరించి అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాల లబ్ది చేకూరుతుందని తెలిపారు. చిత్తూరులో మూతబడ్డ పాలడైరీని పునరుద్ధరించి అమూల్ సంస్థకు అప్పగించి పాడి రైతులకు మేలు చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. స్వతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎస్ సి, ఎస్ టి లకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటుకు జిఓ ను జారీ చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని, భారత దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా ఎస్.సి, ఎస్.టి లకు స్మశాన వాటికలు లేని గ్రామాలకు స్మశాన వాటికల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇందుకు అవసరమైన జిఓ ను జారీ చేయడం ఒక చరిత్ర అని, ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నెరవెర్చారని, ఎస్.సి, ఎస్.టి లు ఎప్పుడూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని తెలిపారు. 


               *గౌ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖమాత్యులు మాట్లాడుతూ* అర్హులకు ఎటువంటి పరిస్థితిలోనూ సంక్షేమ పథకాల లబ్దికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ద్వైవార్షిక నవరత్నాల సంక్షేమ పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మందికి రూ. 590.91 కోట్లను ముఖ్యమంత్రి లబ్ది చేకూర్చడం జరిగిందని, ఇందులో జిల్లాకు చెందిన 48,590 మందికి రూ.70.44 కోట్లు డిపిటి ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. లబ్దిదారులు ఈ నగదును పద్ధతి ప్రకారం వినియోగించుకుని కుటుంబాల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలని కోరారు. పేదరికం అనే అర్హతను ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు మనం అందరం రుణపడి ఉండాలని తెలిపారు. లబ్దిదారులను అనర్హులుగా గుర్తించే ముందు వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నదని, సరైన సంజాయిషీ అందినట్లితే వారిని అర్హులుగా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ/వార్డు సచివాలయాలలో లబ్దిదారుల జాబితాలను డిస్ప్లే చేసి పారదర్శకతతో అవినీతికి తావు లేకుండా కుల, మత, వర్గ, పార్టీ లకు అతీతంగా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలో పథకాల లబ్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం అని తెలిపారు.  


      *జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ* అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్థిర సంకల్పంతో జూన్ నుండి నవంబర్ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్ నెలలో అందించడం జరుగుతున్నదన్నారు. జిల్లాలో 48,590 మందికి రూ.70.49 కోట్లు లబ్ది చేకూరుతుందని, ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించి ఖరీఫ్ 2021 క్రాప్ ఇన్సురన్స్ క్రింద 1640 కి రూ. 81 లక్షలు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి 2,670 రేషన్ కార్డులు, డిఆర్డిఏ కు సంబంధించివై.ఎస్.ఆర్ చేయూత క్రింద 920 మంది లబ్దిదారులకు రూ.172 లక్షలు, వై.యస్.ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి 8783 మంది లబ్దిదారులకు రూ.241 లక్షలు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద 30,684 మందికి రూ.6,100 లక్షలు, రెవిన్యూ శాఖకు సంబంధించి ఇంటి పట్టా 272 మందికి, సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి జగనన్న విద్యా దీవెన క్రింద 2,789 మందికి రూ.396 లక్షలు, జగనన్న వసతి దీవెన కు సంబంధించి 632 మందికి రూ.54.405 లక్షల లబ్ది చేకూరుతున్నదని తెలిపారు.


Comments