రైతాంగం దశాబ్దాల కలను నెరవేర్చడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చింది



నెల్లూరు, డిసెంబర్ 4 (ప్రజా అమరావతి): సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న  కనుపూరు కాలువ నుంచి ఇడిమేపల్లి చెరువుకు సాగునీరు అందించే కాలువ నిర్మాణాన్ని పూర్తిచేసి, ఈ ప్రాంత రైతాంగం దశాబ్దాల కలను నెరవేర్చడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చింద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 ఆదివారం ఉదయం వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో కనుపూరు కాలువ నుంచి ఇడిమేపల్లి చెరువుకు సాగునీరు అందించే పంట కాలువను స్థానిక రైతులు, అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు ఐదారు దశాబ్దాలుగా ఇడిమేపల్లి, జంగాలపల్లి రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా సన్న, చిన్నకారు రైతాంగం బాధలు వర్ణనాతీతమన్నారు. ప్రభుత్వపరంగా కాలువలను నిర్మించడంలో కొంత జాప్యం జరగడంతో ఎన్నికలకు ముందు రైతాంగానికి ఇచ్చిన మాటకు కట్టుబడి తన సొంత నిధులతో కనుపూరు కాలువ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలువను రాత్రింబవళ్లు తవ్వించి సాగునీటిని ఇడిమేపల్లి చెరువుకు అందించి భవిష్యత్తులో సాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. సర్వేపల్లి, కనుపూరు కాలువల ద్వారా ఇడిమేపల్లి  చెరువుకు సాగునీరు అంది రెండు పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. ఇటీవలే  మనుబోలు మండలం రామదాసు కండ్రిక గ్రామ రైతాంగానికి సాగునీరు అందించామని, ఇప్పుడు ఇడిమేపల్లి, జంగాలపల్లి రైతులకు సాగునీరు అందించి వారి చిరకాల కోరిక తీర్చామన్నారు. రైతులకు  సంబంధించి ఏ చిన్న సమస్య కూడా లేకుండా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. 

 

 ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు, సర్పంచ్ ఉప్పు అనూష, స్థానిక ప్రజాప్రతినిధులు మందల వెంకట శేషయ్య, కనుపూరు కోదండరామిరెడ్డి, రఘునందన్ రెడ్డి, ఇడిమేపల్లి, జంగాలపల్లి రైతులు పాల్గొన్నారు. 



Comments