క్లస్టర్ వారిగా ఖాళీలు జాబితా సిద్ధం చేయాలి
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
పుట్టపర్తి, డిసెంబర్ 22 (ప్రజా అమరావతి): క్లస్టర్ వారిగా జిల్లాలో వివిధ అంగనవాడి కేంద్రాలలో అంగనవాడి సహాయకులు, అంగనవాడి కార్యకర్త, మరియు మినీ అంగనవాడి కార్యకర్త సంబంధించిన వివిధ ఖాళీల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం స్థానిక కలెక్టరేట్లోని మిని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో వివిధ ఖాళీల పోస్టుల భర్తీ ప్రక్రియ పై ముందస్తు ప్రణాళికలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఐ సి డి ఎస్ పిడి లక్ష్మికుమారి , ఆర్డీవోలు శ్రీమతి భాగ్యరేఖ, తిప్పినాయక్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అంగన్వాడి కేంద్రాలలో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. సంక్రాంతి లోపు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ప్రభుత్వం నిబంధనల మేరకు ఖాళీలను జాబితా సిద్ధం చేయాలని ఐ సి డి సి సిబ్బందిని ఆదేశించారు.
అంగన్వాడిసహాయకులు, అంగనవాడి కార్యకర్త మినీ అంగనవాడి కార్యకర్త, తదితర ఖాళీలు భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని, వయసు 18 సంవత్సరాల నుండి అర్హత కలిగి ఉండాలని
అర్హత, స్థిర నివాసం, వితంతువు, ఇతర అర్హతలు ప్రామాణికంగా తీసుకొని వివిధ పోస్టులపై ఖాళీల వివరాలను సిద్ధం చేసిన వెంటనే జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆమోదించిన వెంటనే ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 క్లస్టర్ల సిడిపిఓలు పాల్గొన్నారు, నాగమల్లేశ్వరి, రెడ్డి రమణమ్మ, శాంత లక్ష్మి, రాధిక, లక్ష్మి, మహాలక్ష్మి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment