సేవలను మరింత విస్తృతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కొర్లాం సచివాలయ సందర్శన
గంట్యాడ, విజయనగరం, డిసెంబరు 06 (ప్రజా అమరావతి) ః
సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అన్నారు. గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాన్నిమంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ పరిధిలో జరుగుతున్న ఎంఎల్‌సి, సాధారణ ఓటర్ల నమోదును పరిశీలించారు. ఎంఎల్‌సి ఓట్లకు దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడారు. అర్హత ఉన్నవారందరికీ ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. 17 ఏళ్ల వారినుంచి కూడా ఓటుకోసం దరఖాస్తు స్వీకరించాలని సూచించారు. మరణించిన వారిని, వలస వెళ్లిపోయిన వారిని, వివాహం అయి అత్తవారింటికి వెళ్లిపోయిన వారిని జాబితాలో నుంచి తొలగించి, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని సూచించారు.
సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. నెలకు కనీసం 250 సేవలను అందించాలని సూచించారు. విద్యుత్ బిల్లులను కూడా సచివాలయాల్లో చెల్లించేలా ప్రజలను చైతన్య పరచాలన్నారు. స్పందన వినతులను పరిశీలించారు. గృహనిర్మాణంపై ప్రశ్నించారు. అర్హత ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేసి, వెంటనే ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో తాశిల్దార్ స్వర్ణకుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
addComments
Post a Comment