కిల్కారి మొబైల్ అప్లికేషన్ తో అరోగ్య సేవలు.

  కిల్కారి   మొబైల్ అప్లికేషన్ తో అరోగ్య సేవలు.   

వైద్యఆరోగ్య శాఖ లో మాతా శిశు సేవలు బలోపేతం చేయడంలో భాగంగా కిల్కారి మెసేజ్ విధానం త్వరలో ప్రారంభించినట్లు DM&HO  S, V, క్రిష్ణారెడ్డి గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో గర్భవతులకు 4వ నెల నుండి కాన్పు అయినా ఒక సంవత్సరం వరకూ వారానికి ఒకసారి వాయిస్ మెసేజ్ (1,30నిమిషాలు )01244588000నెంబర్ నుంచి వస్తుందని తెలిపారు. ఏదేని కారణం వలన వాయిస్ మెసేజ్ ఇనకపోతే తరువాత 14423 నెంబర్ కూ కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ ధ్వారా వినటానికి అవకాశం ఉందని తెలిపారు.ఈ కాల్స్ పూర్తిగా ఉచితమని చెప్పడం జరిగినది.ఈ వాయిస్ మెసేజ్ ద్వారా నాలుగు అంశాల (మాతృ ఆరోగ్య సేవలు, శిశుఆరోగ్య సేవలు,వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ సేవలు.)గురించి సలహాలు, సూచనలు డా, అనిత ఫ్రీ రికార్డెడ్ వాయిస్ మెసేజ్ రూపంలో వస్తుందని తెలిపారు.

                                                               

Comments