జాతీయస్థాయిలో మన కేజీబీవీలు ఉత్తమంగా నిలవాలి

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా



జాతీయస్థాయిలో మన కేజీబీవీలు ఉత్తమంగా నిలవాలి


బాలికల విద్యోన్నతికి బాధ్యత వహించాలి

పాఠశాల విద్యా కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ .

విజయవాడ (ప్రజా అమరావతి);

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలల్లో చదువుతున్న బాలికలకు అన్ని సౌకర్యాలు అందేలా బాధ్యత వహిస్తూ, వారి విద్యోన్నతకి కృషి చేయాలని జీసీడీవో (గర్ల్ చైల్డ్ డెవలెప్మెంట్ ఆఫీసర్), ఏజీసీడీవోలను ఉద్దేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్  అన్నారు.  

మంగళవారం విజయవాడలోని ఓ హోటల్లో జీసీడీవో, ఏజీసీడీవోలతో రెండు రోజుల పాటు కార్యశాల (వర్క్ షాపు) జరిగింది.  ఈ కార్యశాల ప్రారంభ సభకు కమీషనర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... మహిళలకు వృత్తి, ఆర్థిక, సామాజిక పరమైన అభివృద్ధి చెందాలంటే చదువుకు మించింది ఏమీ లేదని అన్నారు. 

విద్యార్థినులు కేజీబీవీలను తమ సొంత ఇల్లులా భావించేలా, ఎలాంటి ప్రమదాలు జరగకుండా, అపరిశుభ్ర వాతావరణం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, మన రాష్ట్రంలోని కేజీబీవీలు జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కేజీబీవీల అభివృద్ధికి పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కార దిశగా పయనించాలని కోరారు.


బాలికల సౌకర్యాలను గమనించాలి

అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ... జిల్లాస్థాయిలో బాలికల విద్యను సక్రమంగా సాగేందుకు జీసీడీవోలు నాయకులని అభివర్ణించారు. కేజీబీవీలను తరచూ సందర్శించి అక్కడ సౌకర్యాలు, కాంపౌండ్ వాల్, మరుగుదొడ్లు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణ, సిక్ రూమ్, గ్రంథాలయం, లేబొరేటరీ, బాలికల భద్రత  వంటివి పరిశీలించాలన్నారు.  అనంతరం జీసీడీవో విధివిధానాలు తెలిపే ఎస్ఓపీ, విజిట్ ఫార్మట్ గురించి వివరించారు. కేజీబీవీల్లో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. 180 కేజీబీవీల్లో (Personalised and Adaptive Learning (PAL) కార్యక్రమాన్ని అమలు చేస్తామని అన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము బతకగలిగేలా ఒకేషనల్ కోర్సులు ద్వారా శిక్షణ ఇవ్వాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో  ఏఎస్పీడీ సమగ్ర శిక్షా అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసుల రెడ్డి గారు, కేజీబీవీ సెక్రటరీ కె.రవీంద్రనాథ్ రెడ్డి గారు, సీఈ కె.శ్రీనివాసరావు గారు, జిల్లాల నుంచి జీసీడీవోలు, ఏజీసీడీవోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, యూనిసెఫ్, సాల్ట్, రూమ్ టూ రీడ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


ఫొటోలు: 

1. సమావేశంలో మాట్లాడుతున్న కమీషనర్, ఎస్పీడీ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు

2. పాల్గొన్న జీసీడీవోలు, ఏజీసీడీవోలు, అధికారులు.





Comments