హైల్తు అండ్ నూట్రిషన్ పై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం

 హైల్తు అండ్ నూట్రిషన్ పై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో సమావేశం


అమరావతి,30 డిసెంబరు (ప్రజా అమరావతి):జనవరి 5 నుండి 7 వరకూ జరగనున్న ద్వితీయ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో చర్చించనున్నసబ్ థీమ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశంపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి(Rajiv Gauba)కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్,కేరళ, రాజస్థాన్,మమణిపూర్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ చిన్నారుల్లో పౌష్టికాహార లోప నివారణ,మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడం,ఇనిస్ట్యూషనల్ డెలివరీలను పెంచేందుకు,ఇమ్యునైజేషన్ కార్యక్రమాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సిఎస్ లతో ఆయన సమీక్షించారు.

ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు పలు వినూత్నమైన ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు.ఒక టార్గెటెడ్ అప్రోచ్ తో నాన్ కమ్యునికల్ డిసీజెస్ (సాంక్రామికేతర వ్యాధులు)ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.కోవిడ్ సమయంలో సాధారణం కంటే 10శాతం అధికంగా మరణాలు సంభవించాయని గుర్తు చేశారు.ఎన్సిడి-సిడి కార్యక్రమం కింద రాష్ట్రంలో ఇప్పటికే 70 శాతం జనాభాను  స్క్రీనింగ్ చేయడం జరిగిందని చెప్పారు.3కోట్ల 60 లక్షల మందికి ఇప్పటికే ఆయుస్మాన్ భారత్ గుర్తింపు కార్డులు రూపొందించడంతో పాటు 3కోట్ల 50 లక్షల హెల్తు కార్డులను ఎబిడియంతో అనుసంధానించడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.రాష్ట్రంలో వైస్సార్ హైల్తు క్లినిక్ ల కార్యక్రమం క్రింద ప్రాధమిక ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబకు  వివరించారు.ప్రతి 2000-2500 జనాభాకు ఒక విలేజ్ హెల్తు క్లినిక్ కమ్ హెచ్ డబ్ల్యుసిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆరోగ్య సిబ్బందిని నియమించడంతో పాటు వాటిలో సుమారు 50 రకాల మందులను అందుబాటులో ఉంచామన్నారు.అదే విధంగా ఎంఎల్హెచ్పిఓలు యోగా,వెల్నెస్ కార్యక్రమాలను నిర్వహించడం తోపాటు ఎన్సిడి కేసులను నిరంతరం పర్యవేక్షించడం మందులను సరఫరా చేయడం ప్రజల జీవన శైలి నిర్వహణలో తగిన మార్గదర్శకాలు అందించడం జరుగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్(FPC)కింద ఇంటివద్దకే వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్.డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఈవిధానం కింద ప్రతి పిహెచ్సికి ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఒకరు ఒపి చూసుకుంటారని మరొకలు ప్రతి విలేజ్ క్లినిక్ ను నెలలో రెండు పర్యాయాలు సందర్శస్తారని వివరించారు.అలాగే ఎన్సిడి,ఎంసిహెచ్ సేవలను,స్కూల్స్ మరియు అంగన్ వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ఆరోగ్య సేవలను,మెడికల్ అధికారి ఎపి హెల్తు యాప్ ను వీరు మానిటర్ చేయడంతో పాటు పాలో అప్ ట్రీట్మెంట్ తోపాటు పిఎంజెఎవై-ఆరోగ్యశ్రీ కింద అవసరమైన రోగులకు రిఫరల్ సేవలకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని సిఎస్ చెప్పారు.

ఆయుస్మాన్ భారత్ పియంజెఎవై-డా.వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద 5లక్షల రూ.లు లోపు వార్షికాదాయం కలిగిన 85శాతం పైగా కుటుంబాలను దీనికింద కవర్ చేయడం జరుగుతోందని,2225 ఎంపేనల్డ్ నెట్ వర్కు ఆసుపత్రుల ద్వారా 3255 రకాల వైద్య సేవలు అందించడం జరుగుతోందని సిఎస్.డా.జవహర్ రెడ్డి వివరించారు.ఇందుకుగాను యేటా సుమారు 3వేల కోట్ల రూ.ల వరకూ ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా నాడు-నేడు కార్యక్రమం కింద సుమారు 16వేల 855 కోట్ల రూ.లు వ్యయంతో వివిధ ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలు,వైయస్సార్ హెల్తు క్లినిక్లు,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోందని చెప్పారు.ఇంకా నూట్రిషన్,ప్రజల జీవన విధానాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు,బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి సిఎస్ డా.జవహర్ రెడ్డి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కు వివరించారు.

ఈ వీడియో సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, మహిళా శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల సంచాలకులు డా.ఎ.సిరి,సృజన,ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

        

Comments