అన్నీ వర్గాల ప్రజల అవసరాలు గ్రామ స్థాయిలోనే తీరేలా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను


నెల్లూరు (ప్రజా అమరావతి);


అన్నీ వర్గాల ప్రజల అవసరాలు గ్రామ స్థాయిలోనే తీరేలా  సచివాలయ, వాలంటీర్  వ్యవస్థను


ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. 


సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం,నరుకూరుగ్రామ సచివాలయ పరిధిలో రూ.17.50లక్షలతో నూతనంగా నిర్మించిన డా.వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని  గురువారం సాయంత్రం మంత్రి శ్రీ  కాకాణిగోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి ఇటీవల తుఫాన్ వలన నారుమళ్లు దెబ్బ తిన్న రైతులకు సబ్సిడీ పై విత్తనాలను పంపిణీ చేశారు.   అనంతరం మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి నరుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. 


అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అన్నీ వర్గాల ప్రజల అవసరాలు గ్రామ స్థాయిలోనే తీరేలా  సచివాలయ, వాలంటీర్  వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు.  గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేలా గ్రామ సచివాలయం, రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు రైతు భరోసా కేంద్రం,  ప్రజలకు ఫ్యామిలి డాక్టర్ విధానంలో వైద్య సేవలు అందించేందుకు  వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను  ప్రతి గ్రామంలో నిర్మించడం  జరుగుచున్నదన్నారు.  పేద బడుగు బలహీన వర్గాలకు అండగా వుంటూ వారి  అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో  సంక్షేమ పధకాలు అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  అందించడమే లక్ష్యంతో   రాష్ట్ర ప్రభుత్వం  వినూత్నంగా  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ గ్రామంలో కూనా నాగేశ్వర రావు,  జానా శ్యామల, నాసిన లక్ష్మి   తదితర ఒక్కో కుటుంబానికి వివిధ పధకాల కింద  సంవత్సరానికి సుమారు మూడు  లక్షల రూపాయాల మేర ప్రతి లబ్ధిదారునికి ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు.   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో సంక్షేమ పధకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.   అన్నీ వర్గాలకు అండగా వుంటూ ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. 2023 జనవరి 1వ తేదీ నుండి నుండి  రూ. 2500/- లు వున్న పింఛన్ ను రూ. 2750/-లకు  పెంచుతూ సామాజిక పింఛన్ ను ఇవ్వడం జరుగుతుందని, కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడంతో పాటు  అర్హత వున్న ప్రతి కుటుంబానికి పింఛన్  కొనసాగించడం జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, తహశీల్దార్ శ్రీ హమీద్,  ఎంపీడీవో శ్రీమతి హేమలత,  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments