*బధిర క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
*
విజయనగరం, డిసెంబర్ 19 (ప్రజా అమరావతి) ః ఐదో స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ బధిరుల ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాకు చెందిన బధిర విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అభినందించారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఏలూరు వేదికగా జరిగిన క్రీడల్లో జిల్లాకు చెందిన బధిర క్రీడాకారులు పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సొంతం చేసుకున్నారని విభిన్న ప్రతిభా వంతుల విభాగం సహాయ సంచాలకులు ఈ సందర్భంగా తెలిపారు.
*క్రీడాకారులకు ఆర్థిక సాయం అందజేత*
జిల్లా నుంచి ప్రతిభ కనబరిచిన బధిర క్రీడాకారులను డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులాల జిల్లా కో - ఆర్డినేటర్ బి. చంద్రావతి అభినందిస్తూ రూ.3వేల ఆర్థిక సాయం అందజేశారు. దీనిపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
addComments
Post a Comment