సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది


నెల్లూరు,(ప్రజా అమరావతి!


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల పట్ల అంకితభావంతో పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కాగితాలపూరు సచివాలయం పరిధిలోని లక్ష్మీనరసింహపురం గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత  40 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను, 52 లక్షలతో నిర్మించిన సైడు కాలువలను  మంత్రి   ప్రారంభించారు. అనంతరం తిరుపతి తిరుమల దేవస్థానం వారి ఆర్ధిక సహాయంతో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న శ్రీ సీతారాముల వారి దేవాలయం నిర్మాణానికి మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు.


 అనంతరం మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను  అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా   ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ఏదైనా సాంకేతిక కారణంగా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే వాటిని పరిష్కరించడం జరుగుచున్నదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సుమారు 5 లక్షల రూపాయల పైబడి లబ్ధిపొందారని మంత్రి తెలిపారు.    ఈ రోజు లక్ష్మీనరసింహపురం గ్రామంలో  40 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్లను, 52 లక్షలతో నిర్మించిన సైడు కాలువలను  ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అలాగే 10 లక్షలతో నిర్మించనున్న శ్రీ సీతారాముల వారి దేవాలయంనకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,  నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments