అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

    

నెల్లూరు (ప్రజా అమరావతి);


గ్రామ స్థాయిలో  ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పధకాల కింద చేపడుతున్న  అభివృద్ది  పనులను సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు  ప్రత్యేక శ్రద్ధ చూపాల


ని జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, అధికారులను ఆదేశించారు.


శుక్రవారం జడ్.పి. సమావేశ మందిరంలో  జడ్పీ  చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన ప్రణాళికా మరియు ఆర్ధిక విషయాలు, పనుల విషయాలు, గ్రామీణాభివృద్ది,  విద్య, వైద్య , వ్యవసాయ, స్త్రీ సంక్షేమ,  సాంఘిక సంక్షేమ విషయాలు తదితర విషయాలపై  స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి.  ఈ స్థాయీ సంఘాల సమావేశాల్లో   ఆయా శాఖల ద్వారా  అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది  కార్యక్రమాల వివరాలను వివరించడంతో పాటు  ఆయా కార్యక్రమాల ద్వారా చేపడుతున్న  పనుల పురోగతిని  సంబందిత   శాఖల అధికారులు, జడ్పీ  చైర్ పర్సన్ గారికి, ఆయా  స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్పిటిసి సభ్యులకు తెలియచేయడం  జరిగింది.  క్షేత్ర స్థాయిలో వున్న పలు సమస్యలను ఈ సంధర్భంగా స్థాయి సంఘాల సభ్యులు జడ్పి  చైర్ పర్సన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.  జడ్పి  చైర్ పర్సన్ స్పందిస్తూ  సభ్యులు సమావేశంలో  తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల వివరాలను  సంబందింత జడ్.పి.టి.సి.లకు,  ఇతర ప్రజా ప్రతినిధులకు కచ్చితంగా తెలియచేయాలని ఆమె, అధికారులను ఆదేశించారు.


తొలుత ప్రణాళికా మరియు ఆర్ధిక విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో  పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుచున్న అభివృద్ది పనులను  ఆ శాఖ  ఎస్.ఈ  వివరిస్తూ,   గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా గ్రామాల్లోనే సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను, విలేజి హెల్త్ క్లినిక్ లను, రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ లను, బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను మంజూరు చేసి నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.  జిల్లాలో  250.76 కోట్ల రూపాయలతో 659 గ్రామ సచివాలయ భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 295 భవనాలు పూర్తి కాగా, 358 పనులు పురోగతిలోవున్నాయని,  ఇందుకు గాను 114.51 కోట్ల రూపాయలు  ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. అలాగే జిల్లాలో 94.15 కోట్ల రూపాయలతో 538  విలేజి హెల్త్ క్లినిక్ భవనాలు మంజూరు  కాగా, ఇప్పటి వరకు 110 భవనాలు పూర్తి కాగా, 428 పనులు పురోగతిలోవున్నాయని,  ఇందుకు గాను 29.74  కోట్ల రూపాయలు  ఖర్చు చేయడం జరిగిందని  ఎస్.ఈ వివరించారు. జిల్లాలో 656   రైతు భరోసా కేంద్రాలకు  నిధులు కేటాయించగా, ప్రస్తుతం 205 భవనాలు పూర్తి కాగా,   451  పనులు పురోగతిలో  వున్నాయని, ,  ఇందుకు గాను 49.69  కోట్ల రూపాయలు  ఖర్చు చేయడం జరిగిందని  తెలిపారు.  నాబార్డు  గ్రాంటు,   ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన  పేజ్ 3 కింద 70. 39 కోట్ల రూపాయల  అంచనాలతో 15 రోడ్డు పనులు మంజూరు కాగా, 6 పనులు పూర్తి కాగా, 9 రోడ్డు పనులు పురోగతిలో వున్నాయని  తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన రోడ్ల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టడం జరుగుచున్నదని ఎస్.ఈ వివరించారు.  అనంతరం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ  అధ్వర్యంలో  జరుగుచున్న  అభివృద్ది కార్యక్రమాలను ఆ శాఖ ఎస్.ఈ వివరిస్తూ,   2024 సంవత్సరం నాటికి  జల జీవన్ మిషన్  పధకం ద్వారా  ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు కుళాయిల ద్వారా అందించడమే లక్ష్యంతో పనులు జరుగుచున్నవని, ఈ పధకం క్రింద  వివిధ కేటగిరీలలో  486.54   కోట్ల రూపాయల అంచనా విలువతో 3788  పనులు  మంజూరు కాగా,  790 పనులు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో వున్నాయని ఎస్.ఈ తెలిపారు.  

తదుపరి పనుల విషయాల పై  జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో  ఎపిఎస్పిడిసిఎల్  శాఖ ద్వారా  చేపడుతున్న పనులను  ఎస్.ఈ  వివరించడం జరిగింది.  అనంతరం  జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ అధ్వర్యంలో  జరుగు చున్న  అభివృద్ది కార్యక్రమాలను ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్  వివరిస్తూ,  గ్రామీణ ప్రాంతాల్లోని పనులు చేయడానికి వచ్చే ప్రతి నైపుణ్యం లేని కూలీ కుటుంబానికి ఏడాదిలో కనీసం 100 పని దినాలు కల్పించడమే  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని,  2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 83.96 పని దినాలు కల్పించి 318.48 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 


తదుపరి గ్రామీణాభివృద్ది విషయాల పై  జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో   సెట్నల్, నెడ్ క్యాప్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. 

తదుపరి  జరిగిన  స్థాయీ సంఘ సమావేశంలో విద్య, వైద్య సేవలపై  కమిటీ చర్చిండం జరిగింది. విద్య   శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆ శాఖ  అధికారులు వివరిస్తూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న అందరూ విద్యార్ధులకు ప్రభుత్వం వారు బై జ్యూస్ యాప్ ద్వారా డిజిటల్  పాఠ్యాంశాలు విద్యార్ధుల తల్లిదండ్రుల సెల్ ఫోన్ నందు ఉచితంగా అందించడం జరుగుచున్నదని, జిల్లాలో 8వ తరగతి  చదువు తున్న 23,832 మంది విద్యార్ధులకు మరియు 2,880 మంది ఉపాద్యాయులకు బై జ్యూస్ యాప్ తో సహ ట్యాబ్ లను సరఫరా చేయడం జరిగిందని వివరించారు. మన బడి నాడు – నేడు కింద రెండో విడత  1385 పాఠశాలలను ఎంపిక చేసి, వాటిని ఆధునీకరించడం తో పాటు 2044 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు గాను 468.558  కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని  వివరించారు.  జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి వివరించారు.   తదుపరి మత్స్య శాఖ, అటవీ శాఖలకు సంబంధించిన విషయాలు,  స్త్రీ సంక్షేమ విషయాలు,  సాంఘిక సంక్షేమ విషయాలపై  జరిగిన    స్థాయీ సంఘ సమావేశాలల్లో  సంబందిత శాఖల అధికారులు క్షుణ్ణంగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు, వాటి పురోగతిపై  జడ్.పి. చైర్ పర్సన్ వారికి, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు. 


ఈ  స్థాయీ సంఘ సమావేశాల్లో  జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీ చిరంజీవి,  పంచాయతీ రాజ్ శాఖ  అశోక కుమార్, ఆర్డబ్ల్యూఎస్  ఎస్.ఈ శ్రీ రంగ వర ప్రసాద్, ఎస్పిడిసిఎల్  ఎస్.ఈ శ్రీ వెంకట సుబ్బయ్య, నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ శ్రీ రామలింగయ్య, డ్వామా పి.డి. శ్రీ వెంకటరావు, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ సుబ్బారావు, సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్  శ్రీమతి ఉషా రాణి,    జిల్లా వ్యవసాయ శాఖాధికారి  శ్రీ సుధాకర్ రాజు, పశుసంవర్ధక శాఖ జెడి. శ్రీ మహేశ్వరుడు, మత్స్య శాఖ జె.డి శ్రీ నాగేశ్వర రావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్రీ సుబ్బారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పెంచలయ్య, సెట్నల్ సీఈఓ శ్రీ పుల్లయ్య, సంబందిత శాఖల అధికారులు, స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్.పి.టి.సి సభ్యుకు తదితరులు పాల్గొన్నారు. 


Comments