తనరక్తంతో నేలను దున్నే రైతుల ఆత్మహత్యలులేని భారతదేశం కావాలి.



తనరక్తంతో నేలను దున్నే రైతుల ఆత్మహత్యలులేని భారతదేశం కావాలి.



- యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి

- నేడు జాతీయ రైతు దినోత్సవం


గోదావరిఖని డిసెంబర్ 23 (ప్రజా అమరావతి): తనరక్తంతో నేలను దున్నే రైతుల ఆత్మహత్యలు లేని భారత దేశం కావాలి అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనగామ తిరుపతి మాట్లాడుతు అన్నారు. భారత దేశపు రైతుల విజేతగా గుర్తింపు పొందిన భారత 5వ ప్రధాని చౌదరిచరణ్ సింగ్ జన్మ దినాన్ని ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీని జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం అని అన్నారు. రైతులేనిదే మనిషికి మనుగడ లేదు అని రైతు అహర్నిశలు కష్టపడితేనె ప్రజల కంచంలోకి మెతుకు వస్తుంది అని ఆయన అన్నారు. రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు అని వాపోయారు. ఓవైపు అతివృష్టి, అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉంది అని అన్నదాతల జీవితాలకు భరోసా లేని దుస్తితి దాపురించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశానికి వెన్నుముకగా రైతులను అభివర్ణిస్తారు కాని వర్షాలు విత్తనాలు ఎరువులు బ్యాంకు రుణాలు ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది అని అన్నారు. దిగుబడిరాక నష్టాలు, అప్పుల బాధలు భరించలేక, సరైన సమయంలో రుణమాఫీ అందక దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు. రైతులు ఆలా చేసే ముందు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించుకోవాలి అని కష్టాలు ఈరోజు ఉండచ్చు రేపుపోవచ్చు దేశానికి అన్నం పెట్టే రైతన్నే అధైర్యపడితే ఇక ఈ సమాజానికి మెతుకు దొరకదు అని అన్నారు. 

చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు అయినా వర్షం రాక కరువు పొక కష్టం తగ్గక నష్టం తీరక అప్పులు,పేదరికం నిరాశ,నిస్సహాయం పెరిగి కన్నీళ్ల తడి ఆరకపోయిన ఆశ చావక తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదనే బరోసాతొ శరీరాన్ని తాకట్టుపెట్టి, మనసుని బందీ చేసి,ఆత్మని పొలంలోనే పాతిపెట్టి రైతు వ్యవసాయం చేస్తున్నాడు అని అలాంటి రైతులను కాపాడుకోవాలి అని యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి అన్నారు.

Comments