వెనుకపాటుతనాన్ని పారద్రోలాలి

 వెనుకపాటుతనాన్ని పారద్రోలాలి**: హంద్రీనీవా సుజల స్రవంతి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం*


*: స్థానిక ఎమ్మెల్యే దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి*పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 04 (ప్రజా అమరావతి): 


*వెనుకపాటుతనాన్ని పారద్రోలాలి స్థానిక శాసనసభ్యులు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం 342 జాతీయ రహదారికి సంబంధించి మొదటి విడతలో జిల్లాలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు 32 కిలోమీటర్ల రహదారి పనులను భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ విశాఖపట్నం నుండి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. అనంతరం జానకంపల్లి క్రాస్ రోడ్డు నందు 342 జాతీయ రహదారి పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, తదితరులు శంకుస్థాపన చేశారు.* 


*అనంతరం పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో  జానకంపల్లి క్రాస్ రోడ్డు నందు జరిగిన సమావేశంలో  ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు డి శ్రీధర్ రెడ్డి, హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, ఎన్ హెచ్ డివిజన్ అధికారి డి.మధుసూదన్ రావు, ఎన్ హెచ్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 342 జాతీయ రహదారికి సంబంధించి మొదటి విడతలో జిల్లాలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు 32 కిలోమీటర్ల రహదారి పనులను ఈరోజు ప్రారంభించడం ఎంతో శుభ సూచకమన్నారు. జాతీయ రహదారి ఏర్పాటు వల్ల నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా మరింత అభివృద్ధి చెందేందుకు వీలు కలుగుతుందన్నారు.  ఎన్ హెచ్ 42 44వ జాతీయ రహదారులను కలుపుతూ  ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం పుట్టపర్తి అర్బన్ మీదుగా   చిలమత్తూరుమండలంలో కోడూరు తోపు వరకు కొత్తగా 342 జాతీయ రహదారి నిర్మాణానికి అనుమతులు లభించడం జరిగిందని  తెలిపారు. రోడ్ల అభివృద్ధికి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడా ట్కారి, కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర కృషి చేశారని తెలిపారు. దీనివలన  పరిశ్రమల ఏర్పాటుకు, విద్యాసంస్థల  నెలకొల్పటం జరుగుతుంది. యువతకి వలస పోకుండా నివారించవచ్చును తెలిపారు. తొలి విడత ముదిగుబ్బ నుంచి తొమ్మిది గ్రామాల మీదుగా బుక్కపట్నం వరకు 32 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు ఏర్పాటు చేయుచున్నామని ఇందు కోసము రూ 402 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రెండో విడత  పుట్టపర్తి అర్బన్ మీదుగా కోడూరు తోపు వరకు 47.6 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మొత్తం ప్రభుత్వం1800 కోట్ల రూపాయలు ఖర్చు చేయుచున్నామని తెలిపారు. రేపటి సంవత్సరం లోపు 193 చెరువులకు సాగునీరు అందించడానికి,1000 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బృహత్కర్ కార్యక్రమం చేపడుతున్నామని అందుకు నియోజకవర్గంలో గొప్ప బహిరంగ సభ  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యంవల్ల హంద్రీనీవా సుజల స్రవంతి వచ్చిందన్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులు  గోరంట్ల మాధవ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలలో  ముందు వరుసలో నిలపడానికి మనమందరము  కలసికట్టుగా కృషి చేయాలని తెలిపారు, రోడ్ల అభివృద్ధి చెందితే నాగరికతకి  గొప్ప చిహ్నమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కృషివలన జాతీయ రోడ్డు పనులు, 193 చెరువులకు సాగునీరు అందించడం, శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో  ఏర్పాటు చేయడం   జరిగిందని తెలిపారు. నియోజకవర్గ  ప్రజల స్థానిక శాసన  సభ్యులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో సర్పంచులు రూప, నాగలక్ష్మి, జడ్పిటిసి లలిత గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి  తదితరులు  పాల్గొన్నారుComments