పతకాలు సాధించిన ఎపి పోలీస్ క్రీడకారులను *అభినందించి, నగదు బహుమతిని అందించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి.

 

డి‌జి‌పి కార్యాలయం (ప్రజా అమరావతి);


జాతీయ స్థాయిలో  జరిగిన వాలీ బాల్ క్లస్టర్-2022 లోని యోగా, సెపక్‌ తక్రాలో దక్షిణ భారతదేశం నుండి అత్యధిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి  బంగారు, వెండి పతకాలు సాధించిన ఎపి  పోలీస్ క్రీడకారులను *అభినందించి, నగదు బహుమతిని అందించిన డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి.* 



డిసెంబర్ 10th   నుండి 15th  వరకు పంజాబ్ లోని జలంధర్ లో నిర్వహించిన 71వ  జాతీయ స్థాయిలో  జరిగిన వాలీ బాల్ క్లస్టర్-2022 లోని యోగా, సెపక్‌ తక్రా పోటీలలో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత రాష్ట్రాలు, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ కు చెందిన మొత్తం  2770 మంది క్రీడకారులు పాల్గొన్నారు. ఐ‌జి ఎల్.కే.వి రంగారావు,  క్రీడలు & సంక్షేమం నేతృత్వం లోని క్రీడాకారుల బృందం ఇందులో పాల్గొన్నారు. 


*యోగా(మహిళలు):* 

యోగా 35 నుండి 55 సంవత్సరాల గ్రూప్ మహిళల విభాగంలో బంగారు పతకం సాధించగా అదే సింగిల్స్ విభాగంలో విశాఖపట్నం కి చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మహిళా అధికారిని కళ్యాణి Bronze మెడల్ ను సొంతం చేసుకున్నారు.


*యోగా(పురుషులు):*

యోగా 35 నుండి 55 సంవత్సరాల గ్రూప్ పురుషుల విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ జట్టు  మూడో స్థానంలో బ్రౌన్, వ్యక్తిగత విభాగంలో మూడో పతకాన్ని సొంతం చేసుకుంది.



*SEPAKTAKRAW (సెపక్‌ తక్రా):*

జలంధర్ లో నిర్వహించిన సెపక్‌ తక్రా పురుషుల డబుల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన జట్టు Bronze మెడల్ ను కైవసం చేసుకుంది.


సమాచారం కోసం *SEPAKTAKRAW (సెపక్‌ తక్రా)* అంటే వాలీబాల్‌ తరహాలో ఉంటుంది. బంతిని అవతలి కోర్టులోకి పాస్‌ చేసేందుకు కాళ్లు, భుజాలు, తల, మోకాళ్లు మాత్రమే ఉపయోగించాలి. చేతులతో ఆడేందుకు అనుమతి లేదు.



Comments