పథకాల అమలులో పారదర్శకత




రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



 9,493 మందికి ద్వి వార్షిక (బై ఎన్యూయల్)  ఆర్థిక లబ్ది రూ.12.92 కోట్లు


జూన్ నుంచి నవంబర్ వరకు అందని అర్హులకు నేడు ద్వై వార్షిక చెల్లింపులు 


పథకాల అమలులో పారదర్శకత 



,- కలెక్టర్ కే. మాధవీలత , ఎంపి భరత్ రామ్ 



ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అర్హులకు చేరాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అని  కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు.


జిల్లాలో మిగిలి ఉన్న అర్హులైన వారిని గుర్తించి ద్వి వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేసే దిశలో  మిగిలి ఉన్న 9, 493 మంది లబ్ధిదారులకు రూ.12.92 కోట్లు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.



మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి  ద్వి వార్షిక  ప్రయోజనాన్ని మంజూరు చేసిన ప్రయోజనాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా జమ చేసే కార్యక్రమంలో  స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ తో పాటు ఎంపి ఎమ్.భరత్ రామ్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు అందని 

అర్హులకు సాంకేతిక లోపాలు వలన, అర్జీలు ద్వారా వచ్చిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆమేరకు అదనపు పథకాలు ప్రయోజనం కల్పించామన్నారు.  పథకాల అమలులో పారదర్శకత తో కూడి లబ్దిదారుల వివరాలను ఆయా గ్రామ సచివాలయాల్లో నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించడం ద్వారా సామాజిక తనిఖీ చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు.



నిత్య సంక్షేమ లబ్ది అర్హులకు అందించడమే సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం అని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులకు సంక్షేమ పథకాలు అమలు ఈ ప్రభుత్వ పాలన అద్దం పడుతోందని అన్నారు. 


2022 జూన్ నుంచి నవంబర్ వరకు మిగిలి ఉన్న అర్హులకు ద్వి వార్షిక చెల్లింపులు పథకాలు వారీగా   : జగనన్న అమ్మఒడి 1994 మందికి రు. 2.59 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద 1255 మందికి రు. 1.88 కోట్లు, వైయస్సార్ నేతన్న నేస్తం పథకం 22 మందికి రు.5 లక్షలు,  వైయస్సార్ వాహన మిత్ర పథకం 343 మంది రూ.34 లక్షలు,  వైఎస్ఆర్ చేయూత  పథకం 1044 మంది రూ.1.96 కోట్లు,  ఈ బీసీ నేస్తం పథకం కింద 62 మందికి రు. 9 లక్షలు,  జగనన్న చేదోడు పథకం కింద 43 మంది రూ.  4 లక్షల ముప్పై వేలు ,  వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 15 మందికి రూ. 2 లక్షలు,  జగనన్న వసతి దీవెన పథకం కింద 617 మంది రూ.52 లక్షలు,  జగనన్న విద్యా దీవెన  పథకం కింద 4098 మందికి రూ.5.43 కోట్లు మేర జిల్లాలోని అర్హులైన వారికి విడుదల చేశారు.



ఈ సమావేశానికి డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, జేసీ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డి ఆర్ డి ఎ పిడి ఎస్. సుభాషిణి, ఇతర జిల్లా, డివిజన్ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. అనంతరం లబ్దిదారులకు ద్వి వార్షిక ఆర్థిక ప్రయోజనం చెక్కును అందజేశారు.





Comments