ఎన్.సి.సి రన్ ఫర్ యూనిటీ పరుగు
పుట్టపర్తి ,డిసెంబర్ 03 (ప్రజా అమరావతి):
ఎన్.సి.సి యొక్క 75 సంవత్సరాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎన్.సి.సి డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టిన రన్ ఫర్ యూనిటీ పరుగు ఈనెల 05వతేదీన సోమవారం జిల్లాలోని కర్ణాటక చెక్పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ప్రవేశించబోతోందని అనంతపురం 6 (ఎ) బిఎన్ ఎన్.సి.సి సిఓఎల్ ఆఫీసర్ కమాండింగ్ ఎస్.మునద్ర ( Sandeep Mundra ) ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికీ నిర్వహిస్తున్న ఎన్.సి.సి యొక్క 75 సంవత్సరాల ఉత్సవంలో భాగంగా ఈ రన్ ఫర్ యూనిటీ పరుగు కన్యాకుమారి నుండి ఢిల్లీ ఫెరత్ మైదానం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పరుగు సోమవారం కర్ణాటక నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, ఎంతో ఆసక్తి, శక్తి మరియు ఉత్సాహంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పరుగు 60 మంది ఎన్.సి.సి క్యాడేట్స్, ఆర్మీ ఆఫీసర్స్ మరియు కల్నల్ బద్వర్, తదితరులతో కొనసాగుతోందన్నారు. గొల్లపల్లి, పాలసముద్రం జడ్పీ హైస్కూల్ వద్ద నుంచి నిర్వహించే 52 కిలోమీటర్ల ఈ పరుగును ప్రారంభించనున్నామని ప్రకటనలో తెలిపారు. ఇందులో ఏకత్వాన్ని చాటి చెప్పుతూ ఎన్.సి.సి యొక్క నీతిని సూచించే బోన్ హోమికి ప్రతీకగా నిలవనుందన్నారు.
addComments
Post a Comment