*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి*
తిరుపతి, డిసెంబర్05 (ప్రజా అమరావతి): తిరుమల శ్రీవారిని ఉదయం దర్శించుకున్న గౌ.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.
శ్రీ వారి ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, టీటీడి ఈ.ఓ ధర్మారెడ్డి, సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ స్వాగతం పలకగా ముందుగా వారు వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకులు రాష్ట్రపతి వారికి ఆలయ మర్యాదలతో ఇఫ్తేకాల్ స్వాగతం పలికారు. ధ్వజ స్థంభం వద్ద మొక్కులు చెల్లించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా టీటీడి ఛైర్మన్ మరియు ఈ.ఓ శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.
గౌ. భారత రాష్ట్రపతి వెంట
గౌ. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు టూరిజం, డిఓఎన్ఈఆర్ జి.కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కె. నారాయణ స్వామి , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక, క్రీడలు యువజన సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీమతి ఆర్ కె రోజా, దేవాదాయ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ కుమార్ సింఘాల్, డా.రవిశంకర్ ఏపీ అదనపు డిజిపి శాంతి భద్రతలు మంగళగిరి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీ ఎస్. పరమేశ్వర్ రెడ్డి , చిత్తూరు ఎస్ పి నిషాంత్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment