కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అనిల్ కుమార్ కి కలెక్టర్ అభినందనలు*కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అనిల్ కుమార్ కి కలెక్టర్ అభినందనలు*@ మరిన్ని విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు


విజయనగరం, డిసెంబర్ 19 (ప్రజా అమరావతి):- ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి నాలుగు బంగారు పథకాలు సాధించిన బోధంకి అనిల్ కుమార్ ను జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కుమార్ నవంబరు నుంచి డిసెంబర్ వరకు న్యూజిలాండ్ లో జరిగిన క్రీడల్లో భారతదేశం తరఫున పాల్గొని పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 83 కేజీల విభాగంలో నాలుగు బంగారు పథకాలు సాధించాడు. సోమవారం స్పందన కార్యక్రమంలో అనిల్ కుమార్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులను మార్యదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ దుశ్శాలువా కప్పి సత్కరించారు. జిల్లా స్థాయి అధికారులందరూ లేచి నిల్చొని అనిల్ కుమార్ కు చప్పట్లతో అభినందనలు తెలిపారు.Comments