క్లియర్ టైటిల్స్ తో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్


క్లియర్ టైటిల్స్ తో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్


చీపురుపల్లి నియోజక వర్గం, గరివిడి లో 272 ప్లాట్లు

దరఖాస్తుల కు గడువు నెల రోజులు

చదరపు గజం ధర రూ. 7, 700

స్పందన లో  బ్రోచర్ ను ఆవిష్కరించిన కలెక్టర్ , జే.సి

విజయనగరం, డిసెంబరు 05 (ప్రజా అమరావతి): వివాద రహితమైన టైటిల్ ,  ఖచితమైన ధర, బిటి  రహదారులు,   సి సి రహదారులు , ప్రతి ప్లాట్ కు మంచి నీటి సరఫరా ,  భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, పార్క్ లు, అవెన్యూ ప్లాంటేషన్  తదితర సౌకర్యాలతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్  క్రింద ఎం.ఐ.జి లే అవుట్లను వి.ఎం.ఆర్.డి .ఎ ఆధ్వర్యం లో అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు.  చీపురుపల్లి నియోజక వర్గం, గరివిడి లో రైల్వే లైన్ కు దగ్గరగా  272 ప్లాట్లు 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణం లో అందుబాటు లో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 05 నుండి  నెల రోజుల పాటు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని,  http://migapdtcp.ap.gov.in  వెబ్సైటు ద్వారా దరఖాస్తు  చేసుకోవాలని తెలిపారు.  అందుకు సంబంధించిన బ్రోచర్ ను  సోమవారం కలెక్టర్ స్పందన లో వి.ఎం.ఆర్.డి.ఎ అధికారులతో కలసి ఆవిష్కరించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో కూడిన లే ఔట్లను  ప్రభుత్వ ఉద్యోగుల కోట క్రింద కేటాయించిన వారికీ 20 శాతం రాయితీ , ఆఖరి రెండు విడతల్లో ఒకసారి 10 శాతం చొప్పున అందించడం జరుగుతుందని, అదే విధంగా పించన్ దారులకు కూడా ప్రత్యెక రిబేట్ ఉందని తెలిపారు. 

రాష్ట్రం లోనే ప్రధమంగా విజయనగరం జిల్లాలో డ్రా తీసే కార్యక్రమం మొదలయ్యిందని, ఇప్పటికే రెండు లే ఔట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.  3 వ విడత గరివిడి లో ఉందని, కేటాయింపు ఆన్లైన్ ద్వార డ్రా తీయడం ద్వారా  జరుగుతుందని, ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు.   జిల్లా ద్వారా  కొత్తగా రెండు జాతీయ రహదారులు, ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్స్ రానున్నాయని,  విశాఖపట్నం కు అతి సమీపంగా ఉన్న  నేపథ్యం లో జిల్లా భవిష్యతు లో ప్రధాన నగరంగా వేలుగొందనున్నదని, ఇదే మంచి తరుణమని, ఇప్పుడే స్థలం కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. 

ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్  మయూర్  అశోక్,  డి.ఆర్.ఓ  గణపతి రావు, కే.ఆర్.సి ఉప కలెక్టర్ సూర్యనారాయణ, వి.ఎం.ఆర్.డి.ఎ జాయింట్  కమీషనర్ వి.రవీంద్ర ,  చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments