ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి శ్రీ జోగి రమేష్

 విజయవాడ / గుంటూరు / తెనాలి,

05 డిసెంబర్  (ప్రజా అమరావతి);


-- ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి శ్రీ జోగి రమేష్  - జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరం కడు శోచనీయం అంటూ విషణ్ణ వదనంతో భాదితుల పరామర్శకు బయలుదేరివెళ్లారు --


ఈరోజు ఉదయం బాపట్ల జిల్లా జంపని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడటం తను ఎంతో కలచి వేసిందని మంత్రి జోగి రమేష్  గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.


బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందడమే కాకుండా మరో 19 మంది తీవ్ర గాయాలపాలైన సంగతి తెలుసుకున్న మంత్రి జోగి రమేష్  దుఃఖంలో మునిగిపోయారు.


దేవుడు దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదంలో అసువులు బాయడం తనను ఎంతో దుఃఖానికి గురి చేసిన మంత్రి జోగి రమేష్ వాపోయారు.


ఈ రోజు ఉదయం నుంచి పలు ప్రభుత్వ మరియు పార్టీ కార్యక్రమంలో బిజీగా ఉన్న మంత్రి జోగి రమేష్  ఈ ఘోరమైన దుర్వార్త వార్త తెలుసుకొని వాటన్నింటినీ వాయిదా వేసుకుని హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు.


విషణ్ణ వదనంతో మంత్రి జోగి రమేష్  ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అధికారులను మరియు పోలీసులను అడిగి తెలుసుకున్నారు.


క్షతగాత్రులైన వారి పరిస్థితి ఎలా ఉందో వైద్యాధికారుల నుంచి వాకబు చేసిన మంత్రి జోగి రమేష్   ఎంత ఖర్చైనా వెనకాడకుండా మెరుగైన వైద్య సహాయం అందించాలని వారిని ఆదేశించారు.


ఘోర రోడ్డు ప్రమాదంలో తన నియోజకవర్గానికి చెందిన వాసులు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి జోగి రమేష్  నిర్వేదంలో మునిగిపోయారు.


ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే మంత్రి జోగి రమేష్  ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మృతి చెందిన వారందరి కుటుంబాలకు తక్షణ ఏక్షగ్రేషియా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ రాబట్టారు.


క్షతగాత్రులను స్థానికుల సహాయంతో పోలీసులు తెనాలి ఆసుపత్రికి తరలించి చికిత్స  అందిస్తున్నారు.


కాగా పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.


బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామం వద్ద ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురికి ఐదు లక్షలు చొప్పున మంత్రి శ్రీ జోగి రమేష్  ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణ ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు.


మృతుల వివరాలు :-


1.బాడిత రమేష్ (వయసు 35 సంవత్సరాలు) తండ్రి పేరు బాధ్యత పేద సుబ్బారావు.


2. బూడిశెట్టి పాండురంగారావ (వయసు 33 సంవత్సరాలు ) తండ్రి పేరు సుబ్బయ్య.


3. బుద్ధన పవన్ కుమార్ (వయసు 27 సంవత్సరాలు) తండ్రి పేరు శ్రీను


4.పాశం రాంబాబు (వయసు 45 సంవత్సరాలు) తండ్రి పేరు నరసింహారావు


ఇక క్షతగాత్రులైన వారి పేర్లు వివరాలు : 

వీరికి 50 వేల రూపాయల చొప్పున ఆర్ధిక పరిహారం అందించి మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి జోగి రమేష్ గారు ఆదేశించారు.


1.సుబ్రహ్మణ్యరావు

2. నాగరాజు 

3.పి వరుణ్ సంతోష్ 

4.పి కోదండరాం 

5.గోవర్ధన్ 

6.ఆంజనేయులు 

7.లాస్య 

8.బొల్లి శెట్టి మావిల్లు 

9.చంటి 

10.రాంబాబు

11.నాగమణికంఠ 

12. బాలాజీ 

13. బాల పృథ్వినాథ్ 

15.పి సాంబశివరావు 

16.పి ఆంజనేయులు 

17.పి వెంకన్న 

18.పీ భరత్ కుమార్ 

19.పి శ్రీనివాసరావు.

Comments