రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం

 


*రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం*తిరుపతి, డిసెంబర్ 07 (ప్రజా అమరావతి): గౌ. ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వారి కుమార్తె వివాహానికి నెల్లూరు జిల్లాలో హాజరవుతున్న నేపథ్యంలో నేటి  మధ్యాహ్నం 03.00 గం. కు రేణిగుంట విమానాశ్రయానికి  చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వారు గౌ. ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.


వీరితో పాటుగా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ శ్రీకాళహస్తి ఆర్ డి ఓ రామారావు, డిఎస్పీ లు రామచంద్రయ్య, సురేంద్ర, నంద కిషోర్, ఏర్పోర్టు సి ఎస్ ఓ రాజశేఖర్ రేణిగుంట తాసిల్దార్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.


అనంతరం మధ్యాహ్నం 03.10 కి గౌ.ముఖ్యమంత్రి  రాష్ట్ర భూగర్భ గనులు అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తో కలిసి నెల్లూరు కు హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు.

Comments