ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది


 

*మంగళం లో రూ.40 లక్షలతో నిర్మిం చిన సచివాలయ భవనం,రూ.21.80 లక్షలతో నిర్మించిన ఆర్ బి కే  లను ప్రారంభించిన గౌ.   రాష్ట్ర అటవీ, విద్యుత్,శాస్త్ర సాంకేతిక,పర్యా వరణ,శాస్త్ర సాంకే తిక భూగర్భగనుల శాఖా మాత్యులు* 


పుంగనూరు, డిసెంబర్ 23 (ప్రజా అమరావతి):


నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నద


ని . రాష్ట్రఅటవీ,విద్యుత్,శాస్త్ర సాంకేతిక, పర్యావరణ,భూగర్భ గనుల శాఖా మాత్యులు డా.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. 


శుక్రవారం పుంగ నూరు మండలం లోని ఏటి వాకిలి మొదలు 34 గ్రామా లలో పల్లె బాటలో పాల్గొని భీమి గాని పల్లి కాలనీ తో నేటి పల్లె బాట ముగియ నుంది.. ఈ గ్రామాల లో నిర్వహించిన పల్లె బాట కార్య క్రమం లో మంత్రి పాల్గొన్నారు. 


మంత్రి పుంగనూరు మండల పర్యటన లో భాగంగామంగళం లో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాల య భవనం,రూ.21.80 లక్షలతో నిర్మించిన ఆర్ బి కే  లను మంత్రి ప్రారం భించారు.. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుంగనూరు నియో జకవర్గంలోని ప్రజల సమస్యలను పరి ష్కరించుటకు పల్లె బాట కార్యక్రమం ద్వారా కార్యాచరణ రూపొందించుకుని  నియోజకవర్గం లోని ఒక్కొక్కమండలాన్ని ఎంచుకుని ఆ మండల పరిధిలో గల గ్రామాలను సందర్శించడం జరుగుతున్నదని, పర్యటనలో భాగంగా ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలనుసంబంధిత అధికారులకు తెలిపి వాటిని పరి ష్కరించడంజరుగుతున్నదని తెలిపారు. తమ పరిధిలో లేని అంశాలనుప్రభుత్వానికి నివేదించి పరి ష్కారం కొరకు కృషి చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమములో జెడ్పీ చైర్మన్ గోవింద ప్ప శ్రీనివాసులు,  పలమనేరు ఆర్ డి ఓ శివయ్య, రాష్ట్ర జానపద కళల అభి వృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, రాష్ట్ర  మొదలియార్ కార్పొ రేషన్ చైర్మన్  సురేష్ పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆలిమ్ భాష, డి పి ఓ లక్ష్మీ,, ఎంపీ పీ భాస్కర్ రెడ్డి,జడ్పీ టీసీ జ్ఞాన ప్రసూన, ఏఎంసీ చైర్మన్ నాగ రాజు రెడ్డి,బోయ కొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ శంకర్ నారాయణ, నాయకులు పెద్దిరెడ్డి, జింకా చలపతి, చంద్రా రెడ్డి యాదవ్, తహసిల్దార్ సీతా రాం,ఎంపీడీఓ రాజేశ్వరి,మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


Comments