పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్‌డే: జిల్లా ఎస్పీ

 బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, బాపట్ల (ప్రజా అమరావతి);


*జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా పోలీస్ సిబ్బందికి  గ్రీవెన్స్‌డే నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపిఎస్., .*


*పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్‌డే: జిల్లా ఎస్పీపోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు. 2022 వ సంవత్సరం డిసెంబర్ 30 తేది శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ సిబ్బందికి గ్రీవెన్స్‌డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లు మరియు ఇతర విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది పాల్గొని వారి యొక్క వ్యక్తిగత సమస్యలు,  కుటుంబ సభ్యుల ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా బదిలీలు, ఇతర సమస్యలు గురించి ఎస్పీ గారికి స్వయంగా విన్నవించుకున్నారు. 


జిల్లా ఎస్పీ  గ్రీవెన్స్‌డే లో పాల్గొనిన సిబ్బంది యొక్క సమస్యలను కూలంకుషంగా విని, వారి విన్నపాన్ని పరిశీలించి, సానుకూలంగా స్పందించి, అవకాశం వున్న వాటికి సత్వర పరిష్కారం చూపించినారు మరియు ఇతర సమస్యల గురించి డిపిఒ అధికారులతో ఎస్పీ గారు వెంటనే మాట్లాడి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీఠ వేస్తూ సిబ్బంది యొక్క వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన మరియు వ్యక్తిగతమైన  పలు సమస్యలను పరిష్కరించడమే  లక్ష్యంగా ప్రతి  నెలలో ఒకరోజు గ్రీవెన్స్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గ్రీవెన్స్‌డే రోజు పోలీస్  సిబ్బంది వారి సమస్యలను నిర్భయంగా తెలపవచ్చునన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు డిఎస్బి ఇన్స్పెక్టర్ ఏ. శ్రీనివాస్ , డిపిఓ ఏ సెక్షన్  సూపరింటెండెంట్ షేక్.కరీముల్లా ఖాసీం  మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

Comments