ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

 ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా), డిసెంబర్ 30 (ప్రజా అమరావతి):


పరిశ్రమల పరిధిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పెనుకొండ మండలంలోని ఎన్వీహెచ్ గ్రూప్ కంపెనీ, పిసిబి విడిభాగాల తయారీ యూనిట్, ఫూరిషియా (feurecia), హుండాయ్ స్టీల్, హుండాయ్ గ్లోవిస్ తదితర పరిశ్రమలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ముందుగా జిల్లా కలెక్టర్ ఎన్వీహెచ్ గ్రూప్ పరిశ్రమలో కంపెనీ రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం పిసిబి కార్ల విడిభాగాల తయారీ యూనిట్ ను పరిశీలించి ఫామింగ్ ప్లాంట్, ఇంజక్షన్ ప్లాంట్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఆ తరువాత ఫూరిషియా (feurecia) పరిశ్రమను పరిశీలించి భద్రతపై పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. తదనంతరం హుండాయ్ స్టీల్ లో స్లీట్టింగ్ లింగ్, స్టీరింగ్, బ్లాంకింగ్ విభాగాలను తనిఖీ నిర్వహించారు. అటు తరువాత హుండాయ్ గ్లోవిస్ లో టు వీలర్   విడి వి భాగాల సముదాయాలను, కేర్స్ రాక్ ఏరియా, ఇంజన్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్ తదితర విభాగాలను పరిశీలించి ఆయా విభాగాల్లో మిషన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా పరిశ్రమల హెచ్ ఆర్ మేనేజర్ లు అని వివరాలను కూలంకుశంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ చిన్నపాటి ప్రమాదం కూడా చోటు చేసుకోకుండా చూసుకోవాలన్నారు. ఆయా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ భాష, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ కేశవులు, లేబర్ డిప్యూటీ కమిషనర్ రఘురాములు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శంకర్రావు, పరిశ్రమల శాఖ డిడి మహబూబ్ బాషా, ఎన్వీహెచ్ గ్రూప్ ఎండి సిమోన్ సాంగ్, హెచ్ఆర్ అడ్మిన్ డైరెక్టర్ సిబి హన్, ప్లాంట్ హెడ్ మంజునాథ్, మెయింటెనెన్స్ హెచ్ఓడి సాయికుమార్, హెచ్ఆర్ హెచ్ఓడి యోగానంద రెడ్డి, ఫూరిషియా (feurecia) ప్లాంట్ మేనేజర్ సంజయ్ పాలింద్, హెచ్ఆర్ ప్రవీణ్ కుమార్, హుండాయ్ స్టీల్ హెచ్ఆర్ లు సాయి మనోజ్, సంగీత, సేఫ్టీ డిపార్ట్మెంట్ సోహెల్, హుండాయ్ గ్లోవిస్ సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ హెచ్ఓడి వేణుగోపాల్, హెచ్ఆర్ మడోనా, హెచ్ఆర్ హెచ్ఓడి జేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Comments