ఆరుగురి సజీవ దహనం చేసి హత్య చేసిన ఐదుగురు నిందితుల అరెస్ట్

 రామగుండం పోలీస్ కమిషనరేట్ (ప్రజా అమరావతి);ఆరుగురి సజీవ దహనం చేసి హత్య చేసిన ఐదుగురు  నిందితుల అరెస్ట్ మంచిర్యాల డిసిపి గారి కార్యాలయంలో పత్రిక సమావేశం  ఏర్పాటు చేసి గుడిపల్లి  గ్రామమలో ఆరుగురి సజీవ దహనం కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేకర్ ఐపీఎస్ ., గారు అరెస్ట్ వివారులు వెల్లడించడం జరిగినది.

ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ గారు సిబ్బంది తో కలిసి  లక్ష్మణ్ , రమేష్ లము సమ్మయ్య ను మంచేర్యాల ఓవర్ బ్రిడ్జ్ వద్ద పట్టుకొన్నారు నిందితులు చెప్పిన సమాచారం మేరకు సృజన మరియు అంజయ్యా లనుఎస్ఐ మానస  గారు  శ్రీరాంపూర్ వద్ద పట్టుకోవడం జరిగింది .  


మృతుల వివరాలు : 

D1/మాసు శివయ్య s/o మృతుడు భీమయ్య, వయస్సు 48 సంవత్సరాలు, కులం: మాల (SC), occ: VRA మందమర్రి r/o గుడిపల్లి/వెంకటాపూర్ (v) మందమర్రి మండలం.

 D2/శనిగరపు శాంతయ్య s/o రాజలింగు, వయస్సు 57 సంవత్సరాలు, కులం: మాదిగ (SC), occ: సింగరేణి ఉద్యోగి r/o శ్రీరాంపూర్ ఇప్పుడు మందమర్రి మండలం గుడిపల్లి/వెంకటాపూర్ (v)లో నివసిస్తున్నారు.

 D3/మాసు రాజ్యలక్ష్మి @ పద్మ w/o శివయ్య, వయస్సు: 42 సంవత్సరాలు, కులం: మాల (SC), occ: ఇంటి భార్య r/o గుడిపల్లి/వెంకటాపూర్ (v) మందమర్రి మండలానికి చెందినది.

 D4/గడ్డం @ నెమలికొండ మౌనిక w/o దివంగత కిషన్, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: మాల (SC), occ: గృహ r/o కొండంపేట (v), మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం.

 D5/గడ్డం @ నెమలికొండ ప్రశాంతి @ హని, d/o లేట్  కిషన్, వయస్సు: 3 సంవత్సరాలు.

D6 గడ్డం @ నెమలికొండ హిమబిందు  @స్వీటీ d/o లేట్  కిషన్, వయస్సు: 18 నెలలు .


నిందితుల వివరాలు :

A1/మేడి లక్ష్మణ్ s/o నర్సయ్య, వయస్సు 42 సంవత్సరాలు, కులం: బెస్త (BC),occ: అగ్రిల్/ ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్/డాక్యుమెంటర్ r/o H.No.16-51/2/2, బోయవాడ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట.109/2011

 A2/శనిగరపు సృజన @ సుజన వయస్సు: 43 సంవత్సరాలు, కులం: ఎస్సీ మాదిగ, occ: భార్య r/o శ్రీరాంపూర్ జిల్లా మంచిర్యాలు.

 A3/శ్రీరాముల రమేష్ s/o సాయిలు, వయస్సు 36 సంవత్సరాలు, కులం: ఎరుకల (ST), occ: ట్రాక్టర్ డ్రైవర్/ కూలీ r/o గోదావరి రోడ్డు, మంచిర్యాలకు చెందిన లక్సెట్టిపేట. (లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ లో 

 A4/వేల్పుల సమ్మయ్య, s/o దుర్గయ్య వయస్సు: 34 సంవత్సరాలు, కులం మాదిగల్ (SC), OCC: ఇటుకల కూలీ కార్మికుడు r/o H.No. 2-29, మందమర్రి మండలం మంచిర్యాలకు చెందిన గుడిపల్లి/వెంకటాపూర్ (v). జిల్లా.

 A5/ఆర్నకొండ అంజయ్య s/o కొమురయ్య, వయస్సు: 58 సంవత్సరాలు, కులం: SCమాదిగ, occ: Rtd. సింగరేణి ఉద్యోగి r/o చిన్న బొంకూర్ (v),సుల్తానాబాద్ మండలం, ప్రస్తుతం గోదావరిఖనిలో నివాసం ఉంటున్నారు.

 నిందితుల నేర చరిత్ర 

1. మేడి లక్ష్మణ్ : క్రైమ్ నెంబర్ 109/2011, U/S 409,420, 406IPC,of PS Luxettipet, case got AQUITTTED

2. ShanigarapuSujana: Cr No.   24/2013, U/s 324,290 r/w 34 IPC, PS Srirampur.

3. Sriramula Ramesh: Cr No. 66/2015, U/s 304 A IPC of PS luxettipet.

4. VelpulaSammaiah: NIL

5. ArnakondaAnjaiah: Cr No.   24/2013, U/s 324,290 r/w 34 IPC, PS Srirampur.

స్వాదీన పరుచుకొన్నవాటి వివరాలు:

పెట్రోల్ కోసం వాడిన క్యాన్ లు 

మొబైలు ఫోన్  లు 

వివరాల్లోకి వెళితే .. 

నిందితుడు మేడి లక్ష్మన్, s/o నర్సయ్య, వ:42 సం.లు, కులం:బెస్త, వృతి: డాక్యుమెంట్ రైటర్, ని: బోయవాడ , లక్సేట్టిపేట్ నివాసుడు నిందితునికి సత్తయ్య @ శాంతయ్య భూములు కొలవడం వల్ల, వాళ్ళ కుటుంబ సబ్యులు 2010 సంవస్తరము నుండి పరిచయము. శాంతయ్య భార్య సుజన అడగడముతో రెండు దఫాలుగా 4,00000/- లు ఆప్పుగా ఈచ్చినాడు. తరుచుగా శ్రీరాంపూర్ కి వెళ్లి డబ్బులు ఆడిగే క్రమములో సుజనకు మేడి లక్ష్మణ్ కి  మాటలు కలిసి అది వారి  ఇద్దరి మద్య పరిచయం ఏర్పడింది. ఇలా ఫోన్ లో తరుచుగా మాట్లాడుకునేవాళ్ళు మరియు  చాల సార్లు శారిరకముగా శ్రీరాంపూర్ లోని  సుజన ఇంట్లో కలిసారు. శాంతయ్య కి మరియు శ్రీరాంపూర్ లో నివాసం ఉండే మాసు రాజ లక్ష్మి @ పద్మ  w/o శివయ్య లకి అప్పటికేపరిచయం ఉంది, ఈ విషయములో శాంతయ్య తరుచు సుజన మరియు ఆమె తల్లి తండ్రులు ఐన అర్నకొండ అంజయ్య, చంద్రమ్మ లతో గొడవపడుతూ మీకు నా జీతము కాని, ఆస్తులు కాని ఇవ్వను ఆన్ని మాసు రాజ లక్ష్మి@ పద్మ  కే ఇస్తాను ఆని ఆనేవాడు ఇట్టి విషయములో అందాదా సంవస్తారం క్రితం సుజనకి, శాంతయ్య కి సిసిసి నస్పూర్ లోని నర్సయ్య భవన్ నందు మరియు RK5B మైన్ కి దగ్గరలో పంచాయీతీలు కూడా జరిగినవి, శాంతయ్య గుడిపెల్లి లోని మాసు పద్మ వారి ఇంట్లో ఉంటూ, ఆమెతోనే ఉంటూ అక్కడినుండే డ్యూటీ కి వెళ్తు, సుజనను,వారి కుటుంబ సబ్యులను పట్టించుకోకపోవడం లేదు  , వారి బిడ్డ పెళ్లి చేయకపోవడం వల్ల, శాంతయ్య ను చంపితేనే సుజన  కష్టాలు తీరుతాయని,అందాజ ఆరు నేలల క్రితం శాంతయ్య ను చంపాలని, చంపితే లక్సేట్టిపేట్ లోని తన బిడ్డ పేరు మీదున్న మూడు గుంటల భూమిని మేడి లక్ష్మణ్ పేరుపై రాపిస్తా అనిసుజన మరియు ఆమె తండ్రి అంజయ్య లు చెప్పగా అందుకు లక్ష్మణ్  కూడా శాంతయ్య ను చంపితే సుజన కు అడ్డు ఎవరు ఉండరు, ఈన్ని రోజులు లక్ష్మణ్ సుజన ఇచ్చిన డబ్బులు లక్ష్మణ్ కు వస్తావని , శాంతయ్య సింగరేణి ఉద్యోగి కావడం వల్ల ఆతడు చనిపోతే  వచ్చే డబ్బుల్లో కొంత ఐన తీసుకోచ్చు అనే దురాలోచనతో సరే అన్నాడు . ఇంతలో శాంతయ్య గద్దేరగడి లో ఉన్న తన ప్లాట్ ను సుజన తెలియకుండా అమ్ముకున్నాడు , దీంతో లక్ష్మణ్ లక్సేట్టిపేట్ లో ఒక  అడ్వకేట్ ని మాట్లాడి రెండు ప్రైవేటు కేసులు  అనగా ఒకటి శాంతయ్య అన్న తమ్ముల మీద ల్యాండ్ విషయము లో ఒక కేసు మరియు శాంతయ్య పైన maintanance, సింగరేణి లో ఎలాంటి లావా దేవిలు జరగకుండా సు జనతో కేసులు వేఎంచినాడు . శాంతయ్య ని చంపే ఆలోచనలో భాగముగా మర్డర్ కి అయ్యే ఖర్చుల నిమిత్తం సృజన కూతురు మౌనిక పేరు మీద ఉట్కూరు x రోడ్ లో ఉన్న మూడు గుంటల భూమి ఆమ్మి శాంతయ్య ని  చంపమని సుజన  మరియు సుజన తండ్రి అంజయ్య లు నాతో చెప్పినాడు . ఐతే శాంతయ్య ని చంపడము లక్ష్మణ్ ఒక్కడి వల్ల కాదనుకొని, తనకు పరిచయము ఉన్న, లక్సేట్టిపేట్ నివసుడైన శ్రీరాముల రమేష్ ఆతడు పందుల వ్యాపారము చేసి ఆర్దిక నష్టాల్లో ఉన్నందున, ఆతనికి డబ్బు ఆశ చూపి, శాంతయ్య ని చంపితే తనకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తా ఆని లక్ష్మణ్ మరియు సుజన మాట్లాడినారు  మరియు ఈ పని ఒక నెలలోనే జరగాలని ఒప్పందము చేసుకున్నారు . శాంతయ్య ని accident చేసి చంపుదం ఆని ఆనుకొని లక్సేట్టిపేట్ నివాసి ఐన కొమాకుల మహేష్ కు చెందిన ఒక బొలెరో (AP01W9407 BOLERO MAX) వాహనము ను కొనాలని లక్ష నలబై మూడు వేల రూపాయలకు మాట్లాడుకొని అడ్వాన్సుగా నలబై మూడు వేల రూపాయలను లక్ష్మన్, రమేష్ కి ఇవ్వగా , రమేష్ మహేష్ కి ఇచి బోలేరోను తీసుకొని,మాహేష్ కి బండి పేపర్స్ లేకపోవడం వల్ల లక్ష్మణ్  దగ్గర ఉండి బ్రోకర్ ద్వార చేపించుటకు నలబై వేల రూపాయలు ఖర్చు చేసి పేపర్స్ తయరు చేపించి, బొలెరో ను రమేష్ కి ఇచ్చాడు . ఎందువల్ల ఆనగా శాంతయ్య accident లో చనిపోతే పేపర్స్ ఉన్నందున  అన్ని బెనిఫిట్స్ అందుతాయని ఉద్దేశ్యముతో.  శాంతయ్య యొక్క కదలికలు తెలుసుకొనే క్రమములో లక్ష్మణ్  మరియు రమేష్ లము మాసు పద్మ (రాజలక్ష్మి) కుటుంబం ఉంటున్న గుడిపెల్లి గ్రామానికి వెళ్లి అక్కడ శ్రీను లకు చెందినా బెల్ట్ షాప్ లో మద్యము త్రాగుతుండగా లక్ష్మణ్ ను  శ్రీను గుర్తుపట్టి మీది లక్షెట్టిపేట కదా అనగా దానికి నేను ఎలా తెలుసు అని అడుగగా అతను గతంలో లక్షెట్టిపేట లో ఆటో నడిపినప్పుడు చూశానని చెప్పినాడు.  అలా అతన్ని పరిచయం చేసుకొని వారి గ్రామము లో ఉండే మాసు శివయ్య మరియు శాంతయ్య వాళ్ళ గురించి తెలుసా ఆని తనని ఆడగగా, దీనికి శ్రీను, వారి గురించి నాకు తెలియదు, కాని  వారి ఇoటికి దగ్గరగా ఉండే సమ్మయ్య కు తెలుసు ఆనగా లక్ష్మణ్ అతని దగ్గరి నుండి సమ్మయ్య ఫోన్ నంబర్లు తీసుకొని సమ్మయ్యకు ఫోన్ లో మాట్లాడి పిలిపించుకొని లక్ష్మణ్ , రమేష్ , సమ్మయ్య లము పరిచయం చేసుకొని మద్యము త్రాగినారు . తరువాత మళ్ళీ కలుసుకొని మా ప్లాన్ గురించి చెప్పి శాంతయ్యను చంపుటకు, ఆతడి కదలికలు చెప్తూ మాకు సహయం చేస్తే అతడికి 1,50,000/- ఇస్తామని మాట్లాడినారు దానికి సమ్మయ్య ఒప్పుకొన్నాడు.  

గత 6 నెలల నుండి లక్ష్మణ్ ,సుజన తన బర్త శాంతయ్యను చంపడానికి ప్రయత్నిస్తున్నాదున ఫోన్ లో మాట్లాడితే దొరికి పోతామని అందాజ గత 4 నెలలనుండి ఒకరికోకరం ఫోన్ లో మాట్లాడటం మానేసి ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకుంటున్నారు . అందజ నెలరోజుల క్రితం మా పథకం ప్రకారం ఒక రోజు రమేష్ బొలెరో తో  శాంతయ్య ని డికొట్టి చంపుదామని గుడిపెల్లివద్ద కాపు కసి ఉండగా, సమ్మయ్య ఇచ్చిన సమాచారము మేరకు శాంతయ్య, పద్మలు మంచిర్యాల నుండి ఆటో లో బయలు దేరి గుడిపల్లి వస్తున్నారని చెప్పగా రమేష్ బోలెరో తో అట్టి ఆటో ను డీ కొట్టి వారిని చంపుదామని రమేష్ బోలెరో నడుపుతూ గుడిపెల్లి నుండి RK-5 మైన్ కి వెళ్ళే రోడ్డు మలుపు వద్ద రాత్రి అందాద 10 గంటలకు ఆటో ను డి కొట్టబోయీ తప్పిపోయి పెద్ద కందకము లో బొలెరో పడి పోయింది కానీ రమేష్ కు ఎటువంటి దెబ్బలు తగగలలేదు. ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత శాంతయ్య కదళికల గురించి చూస్తుండగా శాంతయ్య, మాసు పద్మ మంచేర్యాల లోని సత్యసాయి హాస్పిటల్ నుండి బయటకు రాగ ఇది చూసిన సమ్మయ్య ఈ విషయాన్ని రమేష్ కు తెలుపగా అట్టి సమయములో శాంతయ్య, మాసు పద్మఒక ఆటో ఎక్కి వెళ్తుండగా రమేష్ బొలెరో వాహనముతో డీ కొట్టే ప్రయత్నం చేయగా త్రుటిలో తప్పిపోయినది. మరలా లక్ష్మణ్  రమేష్ మరియు సమ్మయ్య లము పథకము మార్చి వారిని కత్తులతో దాడి చేసి చంపాలనుకొని రామకృష్ణాపుర అంగాడిలో రెండు కత్తులు కొన్నారు  కానీ కాని ఇలా చంపితే దొరికిపోతామని, అల చంపడము వద్దని అనుకోని అట్టి కత్తులను లక్షెట్టిపేట లోని లక్ష్మణ్ ఆఫీస్ లో దాచిపెట్టినారు . తరువాత శాంతయ్య ను ఎలాగైనా చంపాలని లక్ష్మణ్, రమేష్, సమ్మయ్య లము కలిసి మంచేర్యాల్ లోని సంధ్య బార్ లో కలిసి మందు తాగుతూ పెట్రోల్ పోసి కాల్చి చంపుదామని నిర్ణయించుకున్నారు . తరువాత 

శుక్రవారము రోజు తేది 16.12.2022 అందాజ మధ్యాహ్నము 2 గంటల సమయమున సమ్మయ్య , రమేష్ కి ఫోన్ చేసి, గుడిపల్లి లోని మాసు శివయ్య ఇంట్లో, శివయ్య తో పాటు, రాజ్యలక్ష్మి మరియు  శాంతయ్య లు ఉన్నారని చెప్పిగా రమేష్ నాతో ఈ రోజు వారిని ఖచ్చితంగా చంపుతాము అని లక్ష్మణ్ ,రమేష్ ఇద్దరు  లక్షేట్టిపేట్ లో బస్సు ఎక్కి, మంచేర్యాల బస్సు స్టాండ్ లో దిగి, అక్కడి నుండి సంధ్య బార్ వెళ్లి మందు తాగినారు . రమేష్ పోయి ఒక పెద్ద ప్లాస్టిక్ క్యాను, ఒక ఖాళి రైస్ బ్యాగు, కారం పొడి మరియు రెండు అగ్గిపెట్టెలు తీసుకొని వచ్చాడు,   అక్కడి నుండి, మంచేర్యాల బస్సు స్టాండ్ కు వచ్చి, రమేష్ , యాదగిరి ఫోన్ కి ఫోన్ చేసి ఆటోలో క్యానులు తీసుకొని రమ్మనగా, యాదగిరి లక్ష్మణ్ అందుబాటులో లేను అని అతనికి తెలిసిన ఆటో డ్రైవరు శీపతి రాజు అను అతనికి చెప్పి రమేష్ నంబర్ ను శ్రీపతి రాజు కి యిచ్చి, యాదగిరి అదిగినట్లు 3 ఖాళీ క్యాన్లు శ్రీపతి రాజు కు యిచ్చి పంపినాడు.లక్ష్మణ్ ,రమేష్ ఆటో మంచేర్యాల లో ఆటో ఎక్కి CCCవద్ద దిగి శ్రీపతి రాజు ఫోనుకు చేయగా, అతడు పెట్రోల్ బంకు అవతలికి రాగ, అతని ఆటో ఎక్కి, CCC నుండి మంచేర్యాల్ కు వచ్చే దారిలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరలోని భారత్ పెట్రోల్ బంకు లో వారి  దగ్గర ఉన్న నాలుగు క్యాన్ లలో నుండి మూడు క్యాన్లలో 5 వేల రూపాయల పెట్రోల్ నింపుకొన్నారు ముగ్గురము మద్యము తాగి, వాటర్  బాటిల్ల ను పెట్రోల్ తో ఇంటిపై చల్లడానికి వీలుగా సగానకి కట్ చేసుకొని పోయదినికి వీలుగా మూడు క్యాన్ లలో ఉన్న పెట్రోల్ ను నాల్గవ క్యాన్ లో కొద్ది కొద్దిగా పోసి, రాత్రి అందాద 12.30 గంటల సమయములో ముందుగ అనుకున్న పథకం ప్రకారం, రమేష్ మరియు సమ్మయ్యలు చెరి రెండు  పెట్రోల్ క్యాన్ లను తీసుకొని, సమ్మయ్య, రమేష్ లు మాసు పద్మ ఇంటి కి నిప్పు పెట్టడానికి నడుచుకుంటూ వెళ్ళినారు. లక్ష్మణ్  ఆదే ఆటో లో  అక్కడనుండి మంచెరియాల కు వచ్చినను రమేష్ నాకు ఫోన్ చేసి మనం అనుకున్నట్లుగానే పెట్రోలె పోసి ఇల్లు కాలపెట్టినాను ఆని చెప్పినాడు.  లక్ష్మణ్  ఆ రాత్రి మంచిర్యాలలో ఉన్న గ్రంథాలయం దగ్గరలో గల డీసెంట్ లాడ్జి లో 80 రూపాయలకు బెడ్ తీసుకొని పడుకొని ఉదయం 7 గంటలకు లక్షేట్టిపేట్ కి వెల్లినాడు .  తరువాత లక్ష్మణ్  యొక్క ఆఫీస్ రూమ్ లక్షిట్టిపేట్ లో ఉండగా మద్యహ్నం 3 గంటల సమయములో రమేష్ న వద్దకు వచ్చి ఆ ఇంట్లో మనం ముగ్గురే ఉన్నారని ఆనుకున్నం కాని  మొత్తం ఆరుగురు ఉండి కాలి చనిపోయీనారు అని తెలిపాడు.  అప్పటి నుండి  లక్ష్మణ్ పోలీస్ వారు నన్ను పట్టుకొంటారని లక్ష్మణ్  రమేష్  ఇంట్లో ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

 ఈ రోజు లక్ష్మణ్ , రమేష్ లము సమ్మయ్య ను మంచేర్యాల ఓవర్ బ్రిడ్జ్ వద్ద కలిసి ముగ్గురు  ఎక్కడికైనా పారిపోవలని అనుకొంటుండగా పోలీసు వారు పట్టుకొన్నారు. హత్య చేయు క్రమం లో కొన్న కత్తులు లక్షెట్టిపేట లోని లక్ష్మణ్  ఆఫీస్ రూమ్ లో దాచి ఉంచినారు. నిందితులు చెప్పిన సమాచారం మేరకు సుజన మరియు అంజయ్యా లను శ్రీరాంపూర్ వద్ద పట్టుకోవడం జరిగింది .

Comments