రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ తరహలో అభివృద్ది చేస్తున్నది :
  *రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ తరహలో అభివృద్ది చేస్తున్నది :* *రాష్ట్ర అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖామాత్యులు* 


పుంగనూరు మండలంలోని 17 ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 1160 మంది విద్యార్థులు, 148 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన మంత్రి


పుంగనూరు, డిసెంబర్ 22 (ప్రజా అమరావతి):  


రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాటశాలలను కార్పొరేట్ తరహలో అభివృద్ది చేస్తున్నదని గౌ. రాష్ట్ర అటవీ, విధ్యుత్, పర్యావరణ,  శాస్త్ర సాంకేతిక,భూగర్భ గనుల శాఖామాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.


గురువారం పుంగనూరు మండలంలోని పలు గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.


ఈ కార్యక్రమం లో భాగంగా మంత్రి పుంగనూరు మండలంలోని 17 ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 1160 మంది విద్యార్థులు, 148 మంది ఉపాధ్యాయులకు  ట్యాబ్ లు పంపిణీ . మాగాండ్లపల్లిలో రూ. 40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనం,రూ. 17.5 లక్షల తో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రి   ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రివర్యులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందాలని సిఎం శ్రీ వైఎస్ జగన్ నాడు- నేడు కార్యక్రమం ను  చేపట్టారని, ప్రతి విద్యార్థి అబివృద్దికి అవసరమైన ఇంగ్లీష్ మీడియం తెచ్చిన ఘనత సిఎం జగన్ దేనని,ఉన్నత కుటుంబాలలోని పిల్లల తో పోటీ పడే స్థాయిలో మౌలికవసతుల కల్పన ఏర్పాటు చేశారని,విద్యా సంక్షేమం లో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, విధ్యార్థులు పోటీ ప్రపంచం లో రాణించేలా అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారానికి   పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామనన్నారు.


ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో రెండవ స్థానాన్ని సాధించి రూ.3లక్షలు గెలుచుకున్న జట్టు ను మండలంలోని సింగిరిగుంట వద్ద మంత్రి అభినందించారు. 


ఈ కార్యక్రమములో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పలమనేరు ఆర్ డి ఓ శివయ్య, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పలమనేరు, కుప్పం, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్,జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజు రెడ్డి, బోయకొండ గంగమ్మ పాలకమండలి చైర్మన్ శంకర్ నారాయణ, వక్స్ బోర్డ్ జిల్లా చైర్మన్ రహమతుల్లా, నాయకులు పెద్దిరెడ్డి,తహసిల్దార్ సీతారాం,ఎంపీడీఓ రాజేశ్వరి, మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Comments