పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత*
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి , డిసెంబర్ 21 (ప్రజా అమరావతి);
*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల నందు సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం అమలులో మోడల్ స్కూల్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి జిల్లా అధికారులతో మరియు విద్యార్థులచే మొక్కలు ను నాటించారు. అనంతరం మోడల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఅందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఏ భూభాగమైనా సమతుల్యంగా ఉండాలంటే ఆ ప్రాంతంలో 33% అడవులు పచ్చదనం ఉండాలని అందుకు మనం చెట్లు నాటే వాటిని సంరక్షించడం అవసరమని తెలిపారు. మొక్కలను మనము కాపాడితే అవి మానవునికి అనేక రకాలుగా ఉపయోగపడతాయని తెలిపారు. పుట్టినరోజు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటితే అవి నీ జన్మ దినోత్సవం చిహ్నంగా మిగిలిపోతాయని తెలిపారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి మనమందరం మొక్కలు నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు అంతకుమునుపు విద్యార్థులచే జగనన్న పచ్చ తోరణం ప్రతిజ్ఞ గావించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక వన విభాగం డివిజన్లో అటవీశాఖ అధికారి పి శ్యామల, డివిజనల్ అటవీశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి, dwmaపిడి రామాంజనేయులు, ఉద్యానవన శాఖ అధికారి చంద్ర శేఖర్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు , జడ్పిటిసి లక్ష్మీ నరసమ్మ, సర్పంచి వెంకటసుబ్బడు, ఎంపీటీసీ మధురిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment