ఆరోగ్యశ్రీలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం

 ఆరోగ్యశ్రీలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతం



 సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రోగులు


 కోవిడ్ అనంతరం కీళ్లపై దుష్పరిణామాలు..


 ఖర్చు అధికమైన సామాజిక బాధ్యతతో నిర్వహణ 


డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి

గుంటూరు (ప్రజా అమరావతి);

     లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ వైయస్సార్  ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడం శుభ పరిణామం అని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత  డాక్టర్ బుసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చిన తర్వాత  తొలిసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాయి భాస్కర్ హాస్పిటల్ లో ప్రారంబింప చేసి విజయవంతం చేశారు. బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్ల నందిరాజు తోటకు చెందిన జంపని పద్మావతికి, గుంటూరు బ్రాడీపేటకు చెందిన చంద్రశేఖర్ కు నిర్వహించిన తుంటి మార్పిడి ఆపరేషన్లు విజయవంతమయ్యాయి.

 అరండల్ పేట లోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు తెలియజేశారు.

  కోవిడ్ నివారణలో భాగంగా రోగులపై అధిక స్థాయిలో స్టెరాయిడ్లు వాడకం వల్ల చిన్న రక్త కణాలు మూసుకుపోయి ప్రధానంగా ఎముకలు కీళ్లపై తీవ్ర దుష్పరిణామాలు కలుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగా తుంటి అరుగుదలపై ప్రభావం చూపుతున్నదని, జాయింట్లు మెత్తబడి తొందరగా గుల్లబారి చిన్న వయసులోనే అరుగుదల ప్రారంభమై నడవలేని స్థితికి చేరుతున్నారని అన్నారు .

  ఇదే ఇదే విషయాన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే ఆరోగ్యశ్రీ కింద తుంటి మార్పిడి శాస్త్ర చికిత్సలను నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు.

 దాదాపు 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఈ ఆపరేషకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 1.10 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండువేలకు పైగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెయ్యికి పైగా ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తున్నాయని అన్నారు. ఆపరేషన్ నిర్వహణకు ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సూచన మేరకు ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని ఆరోగ్యశ్రీ కింద  ప్రారంభించినట్లు తెలిపారు. ఒకసారి తుంటి మార్పిడిఆపరేషన్ నిర్వహిస్తే 25 నుంచి 30 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతారని చెప్పారు.

    ఆరోగ్యశ్రీ కింద నిర్వహించే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలపై ప్రజల్లో  మరింత అవగాహన కోసం మీడియా కృషి చేయాలని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి కోరారు. విలేకరుల సమావేశంలో వైద్యులు మర్రెడ్డి శివారెడ్డి, కొనగండ్ల  శ్రీనివాస్, యరగూటి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments