తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

 


*తిరుపతి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి*తిరుపతి, డిసెంబర్ 27 (ప్రజా అమరావతి): నేటి నుండి ఈ నెల 29 వరకు గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై చంద్రచూడ్ గారు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న  నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గం. లకు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వీరికి ఘన స్వాగతం లభించింది.


గౌ. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు, గౌ. చిత్తూరు ఉమ్మడి జిల్లా జడ్జి భీమరావు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డీకే బాలాజీ, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు అడిషనల్ ఎస్పీ కులశేఖర్, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు గౌ. సి జే ఐ గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


Comments